ఎప్పుడు ఎవర్ ‘గ్రీన్’ గా ఉండాలంటే….ఈ టిప్స్ ఫాలో అవ్వండి
గడచిన కాలం మన చేతుల్లో ఉండదు. కానీ రాబోయే కాలం మనదే అవుతుందనేది నూటికి నూరుపాళ్ళు నిజం. మారిన జీవన ప్రమాణాలు, ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యాన్ని ఘోరంగా దెబ్బతిస్తున్నాయని నిపుణులు చేస్తున్నా హెచ్చరికలను పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని ఆరోగ్య సమస్యలకు మందులు అవసరమైతే,మరికొన్ని సమస్యలను మన ఇంటిలో ఉండే వస్తువులతో నివారించుకోవచ్చు. అలా ఇంటిలో తయారుచేసుకున్న గ్రీన్ టీ ఎన్నో సమస్యలను సులభంగా పరిష్కరిస్తుంది.
దీని వాడకం ఇప్పటిది కాదు. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చైనీయులు దీన్ని ఉపయోగించేవారు. ప్రస్తుతం దీన్ని ప్రపంచ వ్యాప్తంగా త్రాగుతూ ఉన్నారు. మానసికంగా,శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా గ్రీన్ టీ తీసుకుంటున్నారని ఒక సర్వే లో తెలిసింది.
రోజుల తరబడి గంటల కొద్ది వ్యాయామం చేయుట వలన వచ్చే పలితాన్ని క్రమం తప్పకుండా గ్రీన్ టీ త్రాగటం ద్వారా పొందవచ్చు. దీనిలోని ధినైన్ అనే కాంపౌండ్ మెదడును చురుకుగా ఉంచుతుంది. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలను సమర్దవంతముగా ఎదుర్కొనే శక్తి గ్రీన్ టీ లో ఉంది. అంతేకాకుండా గుండె పనితీరును,శరీర ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రొమ్ము క్యాన్సర్ తో బాధ పడేవారు రోజుకు నాలుగు నుంచి ఐదు కప్పుల గ్రీన్ టీ త్రాగితే మంచి పలితాలు ఉంటాయి.