Nava Ratna Kurma Recipe: నవరత్న కుర్మా.. ఇలా సులభంగా చేసేయండి
Nava Ratna Kurma Recipe: నవరత్న కుర్మా.. ఇలా సులభంగా చేసేయండి..
కావలసిన పదార్దాలు :
పనీర్ 200 గ్రామ్స్
బంగాళాదుంపలు 2
బీన్స్ 100 గ్రామ్స్
బటానీలు 2 కప్పులు
క్యాలిఫ్లవర్ 1కప్పు
టొమాటోలు 6
ఉల్లిపాయలు 6
అల్లం, వెల్లుల్లి ముద్ద ౩ చెంచాలు
ధనియాల పొడి 4 చెంచాలు
కారం ౩ చెంచాలు
గరం మసాలా 2 చెంచాలు
పాలు 2 కప్పులు
క్రీం 4 చెంచాలు
నెయ్యి 6 చెంచాలు
ఉప్పు, పసుపు సరిపడా
కిస్మిస్, జీడిపప్పు సరిపడా
త్రుటిఫ్రూటి, అనాసపండు ముక్కలు (నిల్వ ఉంచినవి ) కలుపుకోవచ్చు.
తయారి విదానం :
పనీర్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి నేతిలో వేయించి పెట్టుకోవాలి. కూరలు బీన్స్, బటాణి, బంగాళాదుంపలు, క్యారట్, క్యాలిఫ్లవర్ ముక్కలు చేసి ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయలు సన్నగా, పొడవుగా తరిగి టొమాటో లను వేడి నీటిలో ఉడికించి తోలు తీసి గుజ్జు చేసి ఉంచాలి. ఇప్పుడు బాండిలో నూనె ౩ గరిటె లు వేసి కాగిన తర్వాత ఉల్లిముక్కలు వేపి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దోరగా వేపాలి.
నూనె పైకి తేలిన టొమాటో గుజ్జు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాల వేసి 5 నిమిషాలు తర్వాత ఉడికించిన కూరలు వేసి కొంచెం సేపు ఉడికించాలి. గ్రేవీ చిక్కబడిన తర్వాత పాలు, క్రీం కలిపి రెండు నిమిషాలు మరిగించి దించే ముందు పనీర్ ముక్కలు, కిస్మిస్, జీడిపప్పు నేతిలో వేపినవి అందులో కలిపి కొత్తిమీర అలంకరించి సర్వ్ చేయాలి.