గర్భధారణ సమయంలో ఈ ఆహారం తప్పనిసరి…మరి తింటున్నారా ?
గర్భిణిలు తరచూ పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే పోషకాహారం విషయంలో కాబోయే తల్లులకు అనేక సందేహాలు ఉంటాయి. ఏ ఆహారంలో ఏ ఏ విటమిన్స్ ఉంటాయి. వాటిని ఎంత మేరకు తీసుకోవాలో తెలుసుకుందాము. గతంలో మీకు ఆకుకూరలు అంటే ఇష్టం ఉండకపోవచ్చు. కానీ గర్భంతో ఉన్నప్పుడు మాత్రం వారంలో తప్పనిసరిగా రెండు రకాల ఆకుకూరలు తీసుకోవాలి. తోటకూర, పాలకూర, గొంగోర,చుక్కకూర వంటి ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో మినరల్ తో పాటు విటమిన్ ఎ,బి 12,మాగ్నషియం,పోలిక్ యాసిడ్,ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
మాములు బంగాళా దుంపలు కాకుండా స్వీట్ పొటాటో చాలా మంచివి. వీటిలో విటమిన్ ఎ,విటమిన్ సి,పైబర్ ఎక్కువగా ఉంటాయి. గర్భిణిలు ఈ సమయంలో మాములు పళ్ళు కన్నా బెర్రిస్ ఎక్కువగా తీసుకోవటం మంచిది. గర్భిణిలకు అవసరమైన విటమిన్స్,మినరల్స్,యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని నేరుగా తినలేని వారు పెరుగులో కలిపి తినవచ్చు.
గింజలు,తృణ ధాన్యాలలో ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు ప్రోటిన్స్,మినరల్స్ ఉన్నాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద వీటిని తీసుకుంటే సరిపోతుంది. గర్భిణిలు ఆహారంలో బీన్స్ తీసుకుంటే చాలా మంచిది. వీటిలో ప్రోటిన్స్,మినరల్స్,పైబర్,హెల్ది ఫ్యాట్ పుష్కలంగా ఉంటుంది. గర్భిణి పెరుగు తినటం అనేది ఆమెకే కాకుండా కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో ఉండే కాలిష్యము శిశువు ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. పెరుగు అరుగుదల సమస్యను తగ్గించి కడుపు ఉబ్బరం వంటి సమస్యల నివారణకు దోహదం చేస్తుంది.