Movies

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా రాణించలేకపోయిన స్టార్ హీరో…బాబాయి స్టార్ హీరో…?

సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా వచ్చి,తమ టాలెంట్ ,నటనతో దూసుకెళ్ళేవాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ కొందరు కొంతకాలానికి ఫేడ్ అవుట్ అయిపోతూ ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. మరికొందరు బుల్లితెరవైపు అడుగులు వేసి రాణిస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ మూవీ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ కి ఈ మూవీ మంచి ఫాన్ ఫాలోయింగ్ తెచ్చింది.

కొత్త బంగారులోకం,కుర్రాడు,మరోచరిత్ర ,ఏమైంది ఈవేళ, డి ఫర్ దోపిడీ, పాండవులు పాండవులు తుమ్మెద,వంటి సినిమాలు చేసాడు. అయితే కొత్త బంగారులోకం లాంటి మూవీస్ ఒకటి రెండు తప్ప మిగతావి పెద్దగా పేరు తేలేదు. తర్వాత సపోర్టింగ్ యాక్టర్ గా కొన్నాళ్ళు రాణించాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్,అతడి వైఫ్ రితిక సందడి చేసారు. సినిమా ఛాన్స్ లు తగ్గి సొంత వ్యాపారాలు చూసుకుంటున్నాడు.

వరుణ్ సందేశ్ బాబాయ్ జీడిగుంట శ్రీధర్ బుల్లితెర నటుడిగా రాణించాడు. చిన్నతనంలోనే ఆంధ్రజ్యోతి వంటి వాటికి వ్యాసాలు రాసి మంచి గుర్తింపు పొందాడు. తులసి దళం సీరియల్ తో ప్రారంభించి ఆర్టిస్టుగా ఎన్నో సీరియల్స్ నటించి తనకంటూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. పద్మవ్యూహం సీరియల్ కెరీర్ ని మలుపు తిప్పింది. కొన్ని సినిమాల్లో కూడా సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేసాడు. వరుణ్ తాతయ్య జీడిగుంట శ్రీరామచంద్ర మూర్తి రైటర్ గా బుల్లితెరపై రాణించాడు. పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వరుణ్ సందేశ్ అనుకున్నంతగా రాణించలేకపోయాడు.