ఏరోబిక్ వ్యాయామం గురించి తెలుసుకుందామా?
చాలా మంది నోటి నుండి తరచూ వినబడే మాట ఏరోబిక్ వ్యాయామం. వీటిని చేయుట వలన ఆరోగ్యంతో పాటు అనవసర కొవ్వు కూడా తగ్గించుకొని సన్నగా,నాజుగ్గా మారవచ్చు. పావు గంట పాటు ఏకబిగిన ఆపకుండా చేసే వ్యాయామం ను ఏరోబిక్ వ్యాయామం అని చెప్పవచ్చు. వేగంగా నడవటం,జాగింగ్ చేయటం,ఈత కొట్టటం,సైకిల్ తొక్కటం,మెట్లు ఎక్కటం వంటివి ఏరోబిక్ వ్యాయామం క్రిందికే వస్తాయి. వీటి వలన గుండె,ఉపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శరీర కండరాలకు ఆక్సిజన్ సమృద్దిగా అందుతుంది.
వాకింగ్ కొత్తగా మొదలు పెట్టేవారిలో కొద్దిగా దూరం నడవగానే అలసట,ఊపిరి అందనట్లు అనిపిస్తుంది. మరేం పర్లేదు. కంగారు పడకుండా కొంతసేపు విశ్రాంతి తీసుకోని మరల నడక ప్రారంభించాలి. క్రమేపి వేగంగా నడవటానికి అలవాటు పడతారు. ప్రతి రోజు అరగంట వేగంగా నడవాలి. వారంలో కనీసం మూడు రోజులు వేగంగా అరగంట నడవటం మానకూడదు. ఓక కిలోమీటర్ దూరాన్ని చేరటానికి పది నుంచి పన్నెండు నిమిషాల సమయం పడితే అనుకున్న పలితాన్ని త్వరగా పొందుతారు.
జాగింగ్ ను వాకింగ్ బాగా అలవాటు అయిన తర్వాత ప్రారంభించాలి. ప్రారంభంలో జాగింగ్ చేయుట వలన మంచి కన్నా చెడే ఎక్కువగా ఉంటుంది. రెండు మైళ్ళ దూరాన్ని పైన చెప్పిన పద్దతిలో వేగంగా నడిచినప్పుడు మాత్రమే జాగింగ్ కు అర్హులు. ప్రారంభంలో వంద మీటర్ల దురాన్ని వేగంగా నడిచి తర్వాత మాత్రమే జాగింగ్ చేయాలి.
చాల మంది సినీ తారలు తమ సౌందర్య రహస్యం స్విమ్మింగ్ అని చెప్పుతారు. ఏరోబిక్ వ్యాయామం లో స్విమ్మింగ్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఏకబిగిన 20 నిముషాలు ఈత కొడితే తక్కువ సమయంలోనే ఎక్కువ పలితాన్ని పొందవచ్చు. ప్రారంభంలో ప్రతి రోజు కాకుండా రెండు రోజులకు ఒకసారి ఈత కొట్టాలి. అలవాటు అయినాక రెగ్యులర్ గా స్విమ్మింగ్ చేయవచ్చు.
సైకిల్ తొక్కటం అనేది బాగా ఎంజాయ్ చేస్తూ చేసే వ్యాయామమ. దీనివలన శరీరంలో అన్ని భాగాలకు వ్యాయామం అవటంతో పాటు రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. చిన్న చిన్న పనులకు బైక్ లేదా కార్ ను ఉపయోగించకుండా సైకిల్ ను వాడండి.