Beauty Tips

మిల్క్ బాత్ ను ఇంట్లోనే ఏలా చేయవచ్చో చూద్దామా?

మిల్క్ బాత్ లేదా పాల స్నానం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇది పురాణాల కాలం నుండి ఉన్నది. అప్పట్లో రాచరిక స్త్రీలు తమ స్నానానికి పాలు ,గులభిరేకులు ఉపయోగించేవారు. మిల్క్ బాత్ విలాసానికి మాత్రమే కాకుండా సౌందర్యం పెంచుకోవటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. చర్మ సౌందర్యం రెట్టింపు చేసుకోవటానికి పాలస్నానం ఒక మంచి మార్గం. పాలస్నానం కొరకు బ్యూటి పార్లర్ కి వెళ్ళకుండా ఇంటిలోనే చేయవచ్చు.

మిల్క్ బాత్(పాల స్నానం) వలన కలిగే లాభాలు

పాలలో ఉండే అనేక యాసిడ్స్ సౌందర్య సాధనాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం లోపల దాక వెళ్లి శుభ్రపరుస్తుంది. బేటా హైడ్రాక్సైడ్ చర్మంలో ఉన్న మృత కణాలను తొలగించటానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా పాలలో ఉండే విటమిన్ E చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మిల్క్ బాత్ కు వెన్న తీసిన పాలు మంచిది.

ఏలా చేయాలి?

పాలను ఎక్కువ సేపు మరిగించకుండా కొద్దిగా అంటే గోరువెచ్చగా ఉండే విధంగా వేడి చేసుకోవాలి. ఇలా వేడిచేసిన పావు లీటర్ పాలను వేడినీటిలో కలుపుకొని స్నానం చేయాలి. పాలతో పాటు కొంచెం రోజ్ వాటర్ కలుపుకుంటే చాలా బాగుంటుంది.