పరమ శివునికి అభిషేకం చేస్తున్నారా…అయితే ఒకసారి ఇది చూడండి
పరమశివుడు అభిషేక ప్రియుడు. అందువల్ల భక్తితో పరమశివునికి అభిషేకం చేస్తే మనం కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి. ఈరోజు మనం పరమశివునికి దేనితో అభిషేకం చేస్తే ఏ కోరికలు ఎలా నెరవేరతాయి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.
పరమశివునికి బిల్వ జలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి.
పరమశివునికి కొబ్బరినీటితో అభిషేకం చేస్తే సర్వసంపదలు కలుగుతాయి.
పరమశివునికి భస్మ జలంతో అభిషేకం చేస్తే చేసిన పాపాలు తొలగిపోతాయి.
పరమశివునికి సుగంధ జలంతో అభిషేకం చేస్తే పుత్ర ప్రాప్తి కలుగుతుంది.
పరమశివునికి పన్నీరుతో అభిషేకం చేస్తే భూ లాభం కలుగుతుంది.
పరమశివునికి ద్రాక్ష రసంతో చేస్తే అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి.
పరమశివునికి చెరకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది.
పరమశివునికి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం కలుగుతుంది.
పరమశివునికి ఆవుపాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి.
పరమశివునికి తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ది కలుగుతుంది.
పరమశివునికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం,యశస్సు,బలం కలుగుతాయి.
పరమశివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది.