నాపేరు మీనాక్షి సీరియల్ నటి అధ్య రియల్ లైఫ్…నమ్మలేని నిజాలు
ఈటివి ఛానల్ లో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ కి విశేష ఆదరణ లభిస్తోంది. ఇందులో నటిస్తున్న అధ్య కూడా తన అందంతో ,అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 8న ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జన్మించిన ఆద్య అసలు పేరు షేక్ షబీనా. ఈమెను ముందుగా డింపుల్ బ్యూటీ అని పిలుస్తారు.
షబీనాకు ఒక బ్రదర్ ఉన్నాడు. ఆమె స్కూల్ విద్య అంతా జంగారెడ్డి గూడెంలో జరిగింది. అలాగే సి ఎస్ టి ఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేసింది. నటనమీద ఆసక్తితో పలు ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది. మోజో టివి,ఐ న్యూస్,ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్స్ లో పనిచేసింది. ప్రదీప్ నిర్వహిచిన పెళ్ళిచూపులో షోలో ఈమె కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈమె అభిమాన నటుడు విజయ దేవరకొండ.
బుల్లితెర స్క్రీన్ ఫై ఛాన్స్ లు వచ్చాయి. మొదటగా అత్తారింటికి దారేది సీరియల్ లో నటించింది. జెమినిలో రోజా సీరియల్, స్టార్ మా లో వస్తున్న మనసిచ్చి చూడు సీరియల్ లో నటించింది. సీరియల్స్ లో చేస్తున్న ఆమె ఛాన్స్ లు వస్తే సినిమాల్లో కూడా చేస్తానని చెప్పింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ మూవీలో చేయాలనుంది అంటోంది.