శంకరాభరణం సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
ఎలాంటి హీరో లేకుండా కళాత్మక విలువలతో తీసిన శంకరాభరణం మూవీ ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. 1999లో హైదరాబాద్ లో జరిగిన మిలీనియం ఫెస్టివల్ లో శంకరాభరణం చోటుదక్కించుకుంది. బాలు,వాణీ జయరాం లకు తొలిసారి జాతీయ అవార్డులు వచ్చాయి. కళాతపస్వి కె విశ్వనాధ్ తెరకెక్కించిన ఈ మూవీ అంటే డైరెక్టర్ శంకర్ కి చాలా ఇష్టం. అందులో షాట్స్ మాటలు లేకుండా మౌనంగానే చూపించారని సోదాహరణంగా పేర్కొంటూ శంకరాభరణం నూతన డైరెక్టర్స్ కి పాఠ్యాంశంగా ఉండాలన్నది ఆయన భావన.
ఇక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు మూడు రోజులు ఈ సినిమాపై ప్రవచనం చెప్పారంటే అంతకన్నా ఏంకావాలి. సర గమ్ మూవీ తీసి విమానంలో విశ్వనాధ్ వస్తున్నప్పుడు శంకరాభరణానికి భీజం పడితే,నిర్మాత ఏడిద నాగేశ్వరరావు,ఆకాశం శ్రీరాములుతో కల్సి మొక్క తొడిగేలా చేసారు. శివాజీ గణేశన్,అక్కినేని పేర్లు హీరో కోసం అనుకున్నా వారిని కదపలేదు అయితే కృష్ణంరాజుని అడిగితె ఆ పాత్ర తనకు సూటవ్వదని చెప్పడంతో ఇక వైజాగ్ లో డిప్యూటీ కలెక్టర్ గా చేస్తున్న జెవి సోమయాజులుని పిలిపించారు. ఇక హీరోయిన్ గా మంజుభార్గవిని సెలక్ట్ చేసారు. అప్పటివరకూ వ్యాంప్ పాత్రలు వేసిన మంజు భార్గవితో కళాత్మక పాత్ర ఏమిటని చాలామంది విమర్శించారు.
మద్రాసు పూర్ణోదయలో మ్యూజిక్ సెట్టింగ్స్ జరిగాయి. వేటూరి రాసిన శంకరా నాదశరీరా పరా పాటను మొదట రికార్డ్ చేసారు. విజయ గార్డెన్స్ లో1979 జులై 11న పాటలు రికార్డింగ్ స్టార్ట్ అయింది. కెవి మహదేవన్ సంగీతంలో ఈ పాటలను ఎస్పీ బాలు ,ఎస్ జానకి పాడారు. జులై 25న రాజమండ్రిలో షూటింగ్ స్టార్ట్. శంకర శాస్త్రి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు రామచంద్రపురం కోట,వైభవం కోల్పోయాక రఘుదేవపురంలో షూట్ చేసారు. శంకరా పాటను తిరువాయున్నర్ శివాలయంలో తీశారు. చిన్నపిల్లకు పాట నేర్పే సీన్ కోసం పదివేలు పెట్టి సెట్ వేస్తె వరద వచ్చి కొట్టుకుపోవడంతో నీళ్ళల్లో నిలబెట్టి ఆ సీన్ తీశారు.
ఫైనల్ సాంగ్ కూడా రాజమండ్రిలోనే తీశారు. వెండితెరపై బాలుమహేంద్ర తన కెమెరాతో వన్నె తెచ్చారు. 1980జనవరి 26న సినిమా తొలికాపీ వచ్చింది. అయితే ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. దాదాపు వంద ప్రివ్యూలు వేశారు. చివరకు లక్ష్మీ ఫిలిమ్స్ ద్వారా రిలీజయింది. అయితే పదిశాతం కూడా నిర్మాతకు మిగల్లేదు. అయితే ఇంతటి కళాఖండాన్ని నిర్మించడంతో తన జన్మ చరితార్ధమైందని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అనేవారు.
ఫిబ్రవరి 2న మూవీ రిలీజయ్యాక మొదటి వారం ఖాళీగా ఉన్నా, తర్వాత అందుకుంది. దేశవిదేశాల్లో ఎన్నో అవార్డులు,రివార్డులు అందుకుంది. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ ,రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు గెలుచుకుంది. రష్యా, ఇటలీ , మారిషస్ ఫెస్టివల్స్ లో ఈ చిత్రం ప్రదర్శనకు నోచుకుంది. రోమ్ లో ప్రతియేటా పది చిత్రాలను ప్రదర్శిస్తారు. అందులో శంకరాభరణం కూడా ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో సినిమా ప్రదర్శిస్తే, ఆద్యంతం తిలకించి అభినందించడం జరిగాయి. అమెరికాలో నెలన్నర యూనిట్ తిరిగింది. అన్నిచోట్లా చిత్ర ప్రదర్శన అయ్యాక బాలు పాట కచేరి,మంజుభార్గవి నృత్య ప్రదర్శన జరిగేవి.
తమిళనాట ఈ మూవీ సంచలనం సృష్టించింది. మాలయంలో డబ్బింగ్ చేసినా సాంగ్స్ తెలుగులోనే ఉంచారు. డబ్బింగ్ కి లక్ష ఖర్చయితే కోటి కలెక్ట్ చేసింది. బాలు జీవితాన్ని మలుపు తిప్పిన ఈ సినిమాలో సాంగ్ ఒక్కటైనా పాడుతూ ఉంటారు. సంగీత విమర్శకుడు వి ఏకే రంగారావు ఈ సినిమా మలయాళంలో సాంగ్స్ ని తెలుగులోనే ఉంచడం చరిత్రలో తొలిసారి అని అంటారు. ఇక జంధ్యాల డైలాగ్స్ కి ఎక్కువ సమయం తీసుకుని అద్భుత డైలాగ్స్ రాసారు. అయితే డైలాగులు తక్కువ, అభినయం ఎక్కువ. అందుకే 24పేజీలు డైలాగ్స్ మాత్రమే రాశారట. ఎన్టీఆర్,అక్కినేని ఇలా ఎందరో ప్రముఖులు తమ అభిప్రాయాలూ రాస్తే,వాటిని అప్పట్లో పత్రికల్లో ప్రచురించారు.