ఇంట్లోనే స్క్రబ్ తయారుచేసుకుందామా…చాలా సింపుల్
ముఖం పై పట్టిన మురికి పోవాలంటే ఏదో ఒక సబ్బు సరిపోదు. దీని కోసం మూడు రోజుల కొకసారి స్క్రబ్ ఉపయోగించాలి. ఈ స్క్రబ్ కోసం బ్యూటి పార్లర్ కి వెళ్ళవలసిన అవసరం లేదు. చర్మానికి హాని చేయని మరియు రసాయనాలు లేని స్క్రబ్స్ ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు.
1. ఒక చెంచా నారింజ తొక్కల పొడికి, ఒక స్పూన్ పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. దీనిని ముఖానికి పట్టించి బాగా రుద్ది కొంతసేపైన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
2. రెండు చెంచాల పెసరపోడిలో కాస్త పాలు పోసి పలచగా కలిపి ముఖానికి పట్టించి వేళ్ళతో గుండ్రంగా రుద్దాలి. మూడు నిముషాలు రుద్దాక వేడి నీళ్ళతో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా ఉంటుంది.
3. యాపిల్ తొక్క మరియు గింజలు తీసివేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ లో ఒక టీ స్పూన్ తేనే,రెండు స్పూన్స్ ఓట్స్ పొడి,కొంచెం నీరు పోసి స్క్రబ్ గా తయారుచేసుకోవాలి.
4. సెనగపప్పు పొడి, గండం పొడి సమపాళ్ళలో తీసుకోని పచ్చిపాలతో కలపాలి. దీనిని ప్రతిరోజూ ఉపయోగించవచ్చు.
5. ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ కలబంద గుజ్జును కలిపి ముఖానికి పట్టిస్తే మృత కణాలు తొలగిపోతాయి. బేకింగ్ సోడా కి బదులుగా ముతక పంచదార వాడవచ్చు.