బొబ్బిలిరాజా సినిమా గురించి ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా….అసలు నమ్మలేరు
అప్పట్లో కమర్షియల్ ఎలిమెంట్స్,గ్లామర్,కథ,సాంగ్స్ అన్నీ కుదిరి క్లాసిక్ ,మాస్ మూవీ గా సూపర్ డూపర్ హిట్ కొట్టిన బొబ్బిలిరాజా వచ్చి అప్పుడే 30ఏళ్ళు గడిచింది. మెగాస్టార్ చిరంజీవి శకం మొదలయ్యాక స్టార్ హీరోగా ఎదిగిన వాళ్ళల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. శ్రీనివాస కళ్యాణం, స్వర్ణ కమలం, వారసుడొచ్చాడు, ప్రేమ వంటి వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న వెంకీకి మాస్ ఆడియన్స్ చేరలేదు. దాంతో డాక్టర్ రామానాయుడు నుంచి నిర్మాతగా పగ్గాలు అందుకున్న సురేష్ బాబు తొలిసినిమా గొప్పగా ఉండాలని భావించాడు. పరుచూరి బ్రదర్స్ ని కథ చెప్పమంటే… పరుచూరి గోపాలకృష్ణ వేరే కథ చెప్పారు. బి గోపాల్ డైరెక్షన్ లో తీయాల్సిన సినిమా కనుక అటవీ నేపధ్యం ఉండేలా పరుచూరి వెంకటేశ్వరరావు కథ తీర్చిదిద్దారు.
బి గోపాల్ ని మార్చాలని సురేష్ అనుకున్నా, జయంతి సి పరాన్జీ కో డైరెక్టర్ గా ఉండడంతో లవ్ సెంటిమెంట్ సీన్స్ కూడా బొబ్బిలిరాజాలో పండాయి. రాజేశ్వరి దేవి పాత్రకు శారదను అనుకున్నా, అప్పటికే అత్తపాత్రలు చేయడంతో వాణిశ్రీని తీసుకున్నారు. హీరోయిన్ గా రాధను తీసుకోవాలని రామానాయుడు సూచించగా, కొత్త అమ్మాయి అయితే మంచిదని పరుచూరి గోపాలకృష్ణ సూచించడంతో తన దగ్గర ఉన్న ఫోటోలను సురేష్ బాబు పరిచాడు.
దాంతో దివ్యభారతి ఫోటోని పరుచూరి చూపించడంతో బోనీ కపూర్ కి ఫోన్ చేసి హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. తమిళనాడు కోలాచి అటవీ ప్రాంతంలో 40రోజులకు పైగా షూటింగ్ చేసారు. ఇక ఫైట్స్ సమయంలో కూడా డైరెక్టర్ సెట్ లోనే ఉండి చూసుకున్నారు. ఒక్కో బోగీలో అడవి జంతువులను ఉంచి ట్రైన్ మీద ఫైట్ కి ఆకర్షణ తెచ్చారు.
ఇది నల్లమల ప్రాంతంలో తీశారు. షూటింగ్ అయ్యాక చిత్ర యూనిట్ మొదటి కాపీ చూసింది. జైలు ఫైట్,అడవిలో భారీ కాయం గల వ్యక్తితో ఫైట్ తీసెయ్యమని రామానాయుడు చెప్పారు. అయితే ఇలాంటివి ఉండాలని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. మూడో సాంగ్ బలపం పట్టి భామ బళ్ళో పాటను ఐదవ పాటగా, చెమ్మ చెక్క చెమ్మ చెక్క సాంగ్ ని మూడవ పాటగా మారిస్తే బాగా వర్కవుట్ అవుతుందని పరుచూరి చెప్పడంతో ముందు ఒప్పుకోకపోయినా తర్వాత సురేష్ బాబు ఒప్పుకున్నాడు.
ఇళయరాజా మ్యూజిక్ కావడంతో అన్ని సాంగ్స్ అలరించాయి. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో 250రోజులు ఆడింది. తమిళం,హిందీలో కూడా డబ్బింగ్ అవ్వడంతో అక్కడ హిట్. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ తరువాత ఈ సినిమా హయ్యస్ట్ కలెక్షన్ మూవీగా నిల్చింది. అయితే దివ్యభారతి వల్లే ఆడిందని దాసరి అనడంతో ..అన్ని ఎలిమెంట్స్ వలన ఆడిందని పరుచూరి కౌంటర్ ఇచ్చారు.ఇక ఈ సినిమా మళ్ళీ తీయాలని రానా భావిస్తున్నట్లు టాక్.