Movies

శత్రువు సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…మొదట అనుకున్నది వెంకటేష్ కాదట..?

సినిమా నిర్మాతగా రాయపరాజు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన కొడుకు ఎమ్మెస్ రాజు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి , ఎస్ ఎస్ ఫిలిమ్స్ సర్క్యూట్ బ్యానర్ పై మనవడొస్తున్నాడు మూవీ తీశారు. కోడి రామకృష డైరెక్షన్ లో తీసిన ఆ మూవీ హిట్ అవ్వడంతో తన కొడుకు సుమంత్ అశ్విన్ పేరుతొ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టి విక్టరీ వెంకటేష్ తో శత్రువు మూవీ తొలిసారి తీశారు.మొదటి మూవీగా తీసిన శత్రువులో మొదటగా శోభన్ బాబుని హీరోగా అనుకున్నారట.

ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో శోభన్ బాబుని అడిగితె, సినిమా రిస్క్ తో వ్యవహారమని, దాని జోలికి వెళ్ళొద్దని శోభన్ బాబు చెప్పేసాడు. సినిమా ప్లాప్ అయితే రెండు కుటుంబాల మధ్య స్నేహం చెడిపోతుందని అన్నారు. అందుకే సినిమా చేయబోనని ఖరాఖండీగా చెప్పేసాడు. అయితే ఎమ్మెస్ రాజు ఆగలేదు, వెంకటేష్ మీద దృష్టిపెట్టాడు. నిజానికి అప్పటికి నాగార్జున దూసుకుపోతున్నందున నాగ్ తో తీయమని కొందరు సలహా ఇచ్చినా సరే, వెంకీనే ఎంచుకున్నారు.

అయితే తనతో పాటు అందరూ బాగుండాలనే తత్త్వం గల రామానాయుడు ప్రస్తుతం వెంకీ ప్లాప్స్ లో ఉన్నందున తర్వాత కలవమని చెప్పేసారు. కానీ డేట్స్ ఇప్పుడే కావాలని అడగడంతో గట్స్ కి మెచ్చి,డేట్స్ ఇచ్చారు. కోడి రామకృష్ణను డైరెక్టర్ గా ఎంచుకున్నారు. ఎందుకంటే వెంకీ,కోడి రామకృష్ణ కాంబోలో శ్రీనివాస కళ్యాణం హిట్ అయింది. అలా వెంకీతో సినిమా ఫిక్స్ అయ్యిపోయి,విజయశాంతి ని హీరోయిన్ గా పెట్టారు. 1989 అక్టోబర్ 27న శత్రువు షూటింగ్ చెన్నైలో ప్రారంభం అయింది.

ఇక అదేసమయంలో బొబ్బిలిరాజా షూటింగ్ ,శత్రువు ఒకేసారి జరగడం,కోడి రామకృష్ణ కూడా బిజీగా ఉండడం వలన శత్రువు ఆలస్యమైంది. బొబ్బిలిరాజా హిట్ అవ్వడం,విజయశాంతి కర్తవ్యమ్ హిట్ అవ్వడం ఎమ్మెస్ రాజుకి కల్సి వచ్చింది. కోటి పదిలక్షల బడ్జెట్ తో పూర్తయిన ఈ మూవీ 1991జనవరి 2న విడుదలై సూపర్ హిట్ అయింది. లాయర్ అశోక్ గా వెంకీ నటన, పోలీసాఫీసర్ గా విజయశాంతి నటన అలరించాయి. విలన్ గా కోట శ్రీనివాసరావు నటన అదిరింది. చెన్నైలో జరిగిన శత దినోత్సవానికి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.