Movies

ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు ఏ సినిమాలో చివరి పాట పాడారో తెలుసా ?

ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు సుమారుగా 40 వేల పాట‌ల‌తో సంగీత ప్రేమికుల‌ని అలరించారు. సినీ పరిశ్రమలో ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో రికార్డ్స్ ని సాధించారు. అయన చివరిగా పాడిన పాట ప‌లాస 1978లోని ఓ సొగ‌స‌రి పాట‌. ల‌క్ష్మీ భూపాల రాసిన పాట‌ను ర‌ఘు కుంచె స్వ‌ర‌ప‌రచ‌గా బాలు, బేబీ పాడారు. ఆయ‌న ప‌లాస సినిమాలో పాడ‌డం త‌మ అదృష్టం అని ర‌ఘు పేర్కొన్నారు.

బాలు గారు పాటే ప్రాణంగా పాట తాను వేరు కాదని పాటలు పడుతూనే కన్నుమూశారు. ఆయనకు కరోనా రావటంతో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. బాలు ఇలా క‌న్నుమూయడం సంగీత ప్రియుల‌ని శోక స‌ముద్రంలో ప‌డేసింది.