Movies

లవ్ ఇన్ సింగపూర్ సినిమా గురించి ఈ నిజాలు మీకు తెలుసా…అయితే చూసేయండి

మద్రాసు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొంది హీరోగా ఛాన్స్ కోసం చూస్తున్న చిరంజీవికి సహాయ పాత్రలతో పాటు నెగెటివ్ రోల్స్ ఉండే పాత్రలు వచ్చేవి. అప్పటికి పెళ్లి కూడా కాలేదు. అయితే తన నటనతో ఆ పాత్రల్లో రక్తికట్టించిన చిరంజీవి లవ్ ఇన్ సింగపూర్ మూవీలో నటించాడు. ఓ ఎస్ ఆర్ ఆంజనేయులు దర్శకత్వం వహించిన ఈ సినిమా ను ఎస్ వి ఎస్ ఫిలిమ్స్ అధినేతలు నిర్మించారు. సరిగ్గా 4దశాబ్దాల క్రితం తీసిన ఈ మూవీలో రంగనాథ్, చిరంజీవి హీరోలుగా నటించినప్పటికీ, ఆ రోజుల్లో చిరంజీవికి ఉన్న క్రేజ్ దృష్ట్యా , చిరంజీవి చిత్రంగా నిర్మాతలు ప్రచారం చేసారు. తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. తెలుగు వెర్షన్ కి ఓ ఎస్ ఆర్ ఆంజనేయులు, మలయాళ చిత్రానికి బేబీ దర్శకత్వం వహించారు. తెలుగులో రంగనాథ్, చిరంజీవి, లత నటించగా, మలయాళంలో ప్రేమ్ నజీర్, సైమన్, లత నటించారు, ప్రముఖ మలయాళ నటుడు జోష్ ప్రకాష్ ప్రతినాయకుడి పాత్రలో తనదైన శైలిలో విలనిజం చూపించారు.

రంగనాథ్ పోలీస్ ఆఫీసర్ గా, ఆయన తమ్ముడిగా చిరంజీవి నటించిన ఈ చిత్రం అంతర్జాతీయ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందింది. సింగపూర్ అందాలను వెండితెరపై అందంగా ఆవిష్కరించిన ఈ చిత్రం తన కెరీర్లో వెరీ వెరీ స్పెషల్ గా ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి భావిస్తాడు. ఈ మూవీతోనే జోష్ ప్రకాష్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా లో దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ సాగింది. చిరంజీవి విదేశాల్లో జరుపుకున్న తొలి సినిమా షూటింగ్ ఇదే కావడం ఓ విశేషం. ముఖ్యంగా చిరంజీవి క్లాప్ కొట్టి తన చేతుల మీదుగా ప్రారంభించిన తొలి సినిమా ఇదే. ఇక షూటింగ్ కోసం చిరంజీవి విదేశాలకు వెళ్లడం కూడా ఇదే ఫస్ట్. వారం రోజుల వ్యవధిలో చిరంజీవి నటించిన మూడు చిత్రాలు విడుదల కావడం విశేషం. కాళీ, తాతయ్య ప్రేమ లీలలు ఒకే రోజు విడుదల కాగా, ఆ తర్వాత లవ్ ఇన్ సింగపూర్ రిలీజై మంచి విజయాన్ని నమోదుచేసుకుంది.

ఇక చిరంజీవి సరసన సింగపూర్ ప్రముఖ మోడల్ మెడెలిన్ నటించింది. అంతేకాదు,ఈ మూవీలో జూనియర్ ఆర్టిస్టులంతా సింగపూర్ వాళ్లే. ఇంతకీ ఆ రోజుల్లో సింగపూర్లో చిత్ర పరిశ్రమ అనేది లేకపోవడం , కేవలం యాడ్ ఫిల్మ్స్ కి సంబంధించిన చిన్న చిన్న ప్రకటనలు మాత్రమే షూటింగ్ జరుగుతుండడం వలన సింగపూర్ వాసులకు సినిమా షూటింగ్ అంటే ఇష్టం. సినిమా షూటింగ్ ఎక్కడ చేసినా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించేవారు. అక్కడ చిత్రీకరణ కూడా చాలా ఈజీగా అనుమతి వచ్చేది. అందుకే అక్కడి ప్రజల సహకారంతో మూడొంతుల చిత్రాన్ని అతి తక్కువ కాలంలో షూట్ చేశారట. మద్రాసులోని మీనా థియేటర్లో ఈ సినిమా ప్రివ్యూ చూసి చిరంజీవి కారులో బయటకు వస్తుంటే వేరే షూటింగ్ నిమిత్తం అక్కడికి వచ్చిన కమలహాసన్ చూశారు. కానీ చిరంజీవి చూడలేదు. పరుగెత్తి చిరంజీవి కారుని కమల్ ఆపేసినప్పటికీ ఏదో పరధ్యానంలో కమల్ ని పట్టించుకోలేదు. తీరా ఇంటికి వెళ్ళాక చాలా ఫీలయిన చిరంజీవి వెంటనే కమల్ హాసన్ కి ఫోన్ చేసి సారీ చెప్పి వారి ఇంటికి వెళ్లి టీ తాగి కొద్దిసేపు గడిపి తిరిగి వచ్చాడట. అప్పటికే వీరిద్దరూ కల్సి ఇది కథ కాదు మూవీలో చేసారు.