టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోల కూతుళ్లు ఎంత మంది ఉన్నారో తెలుసా ?
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోల కూతుళ్లు ఎంట్రీ ఇవ్వడానికి వీలుండేది కాదు. దీనికి కారణం అభిమానులు ఒప్పుకోకపోవడమే. అందుకే సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల ఎంట్రీ కి అప్పట్లో అడ్డంకి ఏర్పడింది. బాలీవుడ్ లో మాత్రం హీరోల కూతుళ్ళ ఎంట్రీ ఎప్పటినుంచో ఉంది. ఇక ఇప్పుడు సీజన్ మారింది. తమిళంతో పాటు తెలుగులో కూడా హీరోల డాటర్స్ ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. అందులో మెగాబ్రదర్ నాగబాబు, డాక్టర్ రాజశేఖర్, మోహన్ బాబు, రాజేష్ ఇలా చాలామంది హీరోలు తమ డాటర్స్ తో ఎంట్రీ ఇప్పించారు.
బాలీవుడ్ లో తీసుకుంటే, ఒకప్పటి అగ్ర హీరో ధర్మేంద్ర, హేమా మాలిని ఇద్దరు కూతుళ్లు ఈషా డియోల్, అహానా డియోల్ కూడా హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చి, తమ అదృష్టాన్ని బాలీవుడ్ లో నిరూపించుకున్నారు. బాలీవుడ్ హీరో రణధీర్ కపూర్ చిన్నకూతురు కరీనా కపూర్ టాప్ హీరోయిన్ కాగా, పెద్ద కూతురు కరిష్మా కపూర్ కూడా టాప్ హీరోయిన్ గా సత్తా చాటారు. బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా పెద్ద కూతురు.. అక్షయ్ కుమార్ భార్య అయిన ట్వింకిల్ ఖన్నా కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసి,రాణించింది. ట్వింకిల్ చెల్లెలు రింకీ ఖన్నా కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. స్టార్ హీరో జితేంద్ర కూతురు ఏక్తా కపూర్ హీరోయిన్‌గా కాకుండా నిర్మాతగా సత్తా చాటుతోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా బిజీ గా ఉంది. అలాగే బాలీవుడ్ రెబల్ స్టార్ శతృఘ్న సిన్హా కూతరు సోనాక్షి సిన్హా అగ్ర హీరోయిన్ గా ఉంది. బాలీవుడ్ సెకండ్ హీరోగా ఫేమసైన చుంకీ పాండే కూతురు అనన్యా పాండే, బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్, శక్తి కపూర్ కుమార్తె శ్రద్ధా కపూర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
సూపర్ స్టార్ కృష్ణ రెండో కూతురు, మహేష్ బాబు చిన్నక్క మంజుల కూడా హీరోయిన్‌గా అడుగుపెట్టాలన్న ఆశలు ఫలించకపోవడంతో కొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసింది. ఇక మోహన్ బాబు కుమార్తె మంచు లక్షి కూడా వివిధ పాత్రలు చేస్తూ ,టివి షోస్ చేస్తూ అలరిస్తోంది. మెగా ప్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక ఒక మనసు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి , కొన్ని సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు పెళ్లి కూడా కుదిరింది. ఒకప్పటి టాలీవుడ్ నటుడు హీరో రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా అటు తమిళం ఇటు తెలుగు సినిమాల్లో రాణిస్తోంది. టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ గా ఒకప్పుడు సత్తా చాటిన హీరో డాక్టర్ రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక వెండితెరపై హీరోయిన్స్‌గా ఎంట్రీతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ పెద్దన్న ఒకప్పటి నటుడు చారు హాసన్ ముద్దుల కూతురు సుహాసిని ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించి,ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రాణిస్తోంది. ఇక కమల్ హాసన్ బాటలో హీరోయిన్‌గా శృతి హాసన్ సత్తా చాటుతుండగా, మరో కూతురు అక్షరా హాసన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ ముద్దుల కూతురు వరలక్ష్మి కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలతో దూసుకెళుతోంది. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కాగా తమిళంలో ఒకప్పుడు హీరోగా నటించిన విజయ్ కుమార్, అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ మంజుల ముగ్గురు కూతుళ్లు వనిత, ప్రీతి, శ్రీదేవిలు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చి, కొన్ని సినిమాల్లో తమ సత్తా చాటారు.