సూర్యకాంతం అసలు రూపం ఇదే…ఆలా ఉండటానికి కారణం ఇదే
సినిమాల్లో గయ్యాళి పాత్రలతో వన్నె తెచ్చిన సూర్యకాంతం రీల్ లైఫ్ లోనే విలన్ తప్ప ,రీల్ లైఫ్ లో వెన్నలాంటి మనసు గల మనిషని అందరూ చెబుతారు. అప్పట్లో ఇద్దరు అగ్ర హీరోలు నటించిన సినిమాకు ఈమె పేరు వచ్చేలా పెట్టారంటే ఈమె క్రేజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు. అదే గుండమ్మ కథ. ఇప్పుడు ఇలాంటి సినిమా తెరకెక్కించాలంటే ఈమె పాత్రతో సరితూగే వారులేక ఆగిపోయారని టాక్.
అప్పట్లో నెలకు 65రూపాయల వేతనం తీసుకునే సూర్యకాంతం సినిమాల్లో నటించాలని ఇంట్లో వాళ్ళను ఒప్పించి మద్రాసు చేరుకొని జెమిని సంస్థలో చేరి నటించే ఛాన్స్ లు కొట్టేసింది. పెద్దగా చదువుకోకపోయినా కొన్ని డైలాగులు అవలీలగా చెప్పేసేది. ఎస్వీ రాంగారావు ఎలాగో సూర్యకాంతం కూడా స్పాట్ లో డైలాగులు మార్చేసి చెప్పినా అద్భుతంగా పండేవని అంటుంటారు.
చిన్న చిన్న వేషాలు వేస్తూ,వచ్చిన సూర్యకాంతం కి హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చినా ఎందుకో అప్పుడు కుదరలేదని అంటారు. వేరే నటికి ఛాన్స్ రావడంతో చిత్ర యూనిట్ మాత్రం సూర్యకాంతం వైపే మొగ్గింది. అయితే ఇతరుల ఛాన్స్ లు తనకు వద్దని తేల్చి చెప్పేసిందని అంటారు. 1996లో కన్నుమూసిన సూర్యకాంతం గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరుగా నిల్చింది. ఆమెలా ఎవరూ మెప్పించలేకపోయారు. అంతసహజంగా ఆమె నటించి మెప్పించింది. నిజానికి సూర్యకాంతం తల్లిదండ్రులకు ఈమె 14వ సంతానంగా జన్మించింది. చిన్న నాటినుంచి సినిమాలపై ఆసక్తి ఆ దిశగా అడుగులు వేయించాయి.