స్వీటీ అనుష్క కెరీర్ ఆగుతుందా…కొనసాగుతుందా … పరిస్థితి ఏమిటి ?
కొందరు హీరోయిన్స్ స్టార్ ఇమేజ్ అంతగమ్మున పడిపోదు. కొన్ని ఎదురు దెబ్బలు తిన్నా మళ్ళీ ఇమేజ్ తెచ్చేసుకుంటారు. కానీ కొందరు ఎప్పుడు తేరుకుంటారో చెప్పడం కష్టం అనేలా ఉంటుంది. ఇప్పుడు స్వీటీ అనుష్క పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది. తాజాగా ఈమె నటించిన నిశ్శబ్దం మూవీ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఓటిటిలో రిలీజ్ చేసారు. కానీ ఈ మూవీలో ఆమె నటన పెద్దగా బాగోలేదని,పైగా సినిమా కూడా ప్లాప్ అని టాక్ వచ్చేసింది. దీంతో అనుష్క కు ఇక ఛాన్స్ లు రానట్టేనని టాక్ వస్తోంది.
నిజానికి గ్లామర్ పాత్రలతో రాణిస్తూ అరుందతి మూవీ తర్వాత తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న అనుష్క రేంజ్ అమాంతం పెరిగింది. ఇక బాహుబలితో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది. రుద్రమదేవి, భాగమతి వంటి సినిమాలతో హీరో లేకున్నా పర్వాలేదని స్థాయిని తెచ్చుకుంది. ఇక రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటూ వచ్చింది. అయితే సైజ్ జీరో లాంటి సినిమా కోసం ఆమె ఒళ్ళు పెంచింది. ఆతర్వాత ఎంత తగ్గించుకుందామని ట్రై చేసినా ఎక్కడో తేడా కొడుతోంది. ఆ సినిమా తాలూకు తేడా ఇంకా ఆమెలో కనిపిస్తూనే ఉంది. మరి ఈమె కెరీర్ ఆగుతుందా .. కొనసాగుతుందా .. చూడాలి.