పేరు మార్చినా అచ్చిరాలేదా? జబర్దస్త్ ని బీట్ చేయటం కష్టమేనా ?
తెలుగులో కామెడీ షో అనగానే అందరికీ గుర్తొచ్చేది జబర్దస్ కామెడీ షోయే. అంతలా ఈ షో జనంలోకి దూసుకుపోయింది. మొదటి నుంచి ఈ షోకి టిఆర్పి రేటింగ్ అదిరిపోతూనే ఉంది. ఈ షోలో జడ్జీలుగా నాగబాబు, రోజా పోషించిన పాత్ర కూడా అలాంటిదే. కంటెస్టెంట్స్ తమ స్కిట్స్ తో జనాన్ని అలరించడమే కాదు, ఆర్ధికంగా కూడా స్థిరపడ్డారు. అంతెందుకు నాగబాబుకు కూడా ఈ షో మంచి లైఫ్ ఇచ్చిందనే మాట వినిపిస్తూ ఉంటుంది.
అయితే ఎందుకో ఈ షో నుంచి నాగబాబు తప్పుకోవడమే కాదు, అదిరింది పేరిట ఇలాంటి కామెడీ షోయే జి తెలుగులో నాగబాబు స్టార్ట్ చేసాడు. కొందరు జబర్దస్త్ నుంచి వెళ్లారు కూడా. అయినా క్లిక్ కాలేదు. యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కూడా చేసారు. రవి,భాను లను తొలగించి , యాంకర్ గా శ్రీముఖిని పెట్టారు. షో పేరుని కూడా బొమ్మ అదిరింది అని మార్చారు.
ఇన్ని చేసినా సరే, ఈ షో క్లిక్ అవ్వడం లేదు. జబర్దస్త్ ని బీటౌట్ చేయలేకపోయింది. కంటెస్టెంట్స్ ఎంతగా కష్టపడుతున్నా సరే, వ్యూస్ రావడం లేదు. యాంకర్ ,షో పేరు మార్చినా వర్కవుట్ కాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారట నిర్వాహకులు. మరోపక్క జబర్దస్త్ లోకి నాగబాబు వెళ్లాడని ప్రచారం జరిగినా ,ఎందుకో తేడా కొట్టేసింది. బయటకు వస్తూ, నాగబాబు చేసిన వ్యాఖ్యలే మళ్ళీ జబర్దస్త్ వైపు వెళ్లకుండా అడ్డుపడుతున్నాయని టాక్. .