Movies

ఇద్దరు సూపర్ స్టార్ ల మధ్య అనుబంధం గురించి ఈ విషయాలు తెలుసా ?

ఆలిండియా సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కంటే సూపర్ స్టార్ కృష్ణ కొంచెం సీనియర్. వీరిద్దరూ 1960వ దశకంలో హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. అందరూ కొత్తవాళ్లతో సినిమా చేయాలన్న ఆలోచనతో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1965లో వచ్చిన ‘తేనే మనుసులు’ మూవీతో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక కే.ఏ.అబ్బాస్ దర్శకత్వంలో‘సాత్ హిందూస్థానీ’ చిత్రంతో అమితాబ్ బచ్చన్ 1969లో హీరోగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బీ హీరోగా నటించిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇది. అయితే కృష్ణ తొలి సినిమా కలర్ మూవీ అయినప్పటికీ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో నటించారు.

ముఖ్యంగా అప్పట్లో హిందీ సినిమాల మోజు తెలుగు వాళ్ళల్లో ఎక్కువ ఉండేది. అందుకే అమితాబ్ బచ్చన్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవ్వడమే కాకుండా ఎన్నో రీమేక్ అయ్యాయి. ఎన్టీఆర్ సహా పలువురు హీరోలు అమితాబ్ సూపర్ హిట్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా బిగ్‌బీ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసారు. అలాగే కృష్ణ మూవీస్ కూడా అమితాబ్ హిందీలో రీమేక్ చేసారు. ‘అందరికంటే మొనగాడు’ మూవీ సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ ‘సత్తే పే సత్తా’కి రీమేక్ గా తీశారు.

అంతేకాదు,బిగ్ బి అమితాబ్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటైన ‘అమర్ అక్బర్ ఆంథోని’కి తెలుగు వర్షన్ ‘రామ్ రాబర్ట్ రహీమ్’ గా కృష్ణ రీమేక్ చేశారు.ఇందులో రజినీకాంత్, చంద్రమోహన్ నటించారు. అయితే.. కన్నడలో రాజ్ కుమార్ హీరోగా 1978లో విడుదలైన నటించిన ‘శంకర్ గురు’ సినిమాకు రీమేక్ గా కృష్ణ హీరోగా తెలుగులో కాశ్మిర్ నేపథ్యంలో ‘కుమార్ రాజా’ మూవీ గా రీమేక్ చేసారు. అడవి రాముడు తర్వాత సత్య చిత్ర బ్యానర్ వాళ్ళు ఈ మూవీ నిర్మించారు. దీన్ని నేపాల్ బ్యాక్‌డ్రాప్‌తో హిందీలో అమితాబ్ ‘మహాన్’గా 1983లోరీమేక్ చేసారు. ఇక కృష్ణ నటించిన సినిమాలతో పాటు పలు సినిమాలను హిందీలో జితేంద్రతో పద్మాలయ బ్యానర్ లో తీశారు.