కాజల్ పెళ్లి చేసుకోబోయే భర్త ఏం చేస్తారో తెలుసా ?
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరైన కాజల్ అగర్వాల్ ని ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడిగితే, ‘పెళ్లి కుదిరినప్పుడు స్వయంగా నేనే చెబుతా’ అనేది. తాజాగా ఈ బ్యూటీ తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. గౌతమ్ కిచ్లు అనే ఇంటీరియర్ డిజైనర్, వ్యాపారవేత్తను ఈ చందమామ పెళ్లిచేసుకోబో తోంది. ‘గౌతమ్ కిచ్లుని ఈ నెల 30న పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతు న్నానని చెబుతూ , ఈ విషయం ఫాన్స్ తో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.
ముంబైలో సింపుల్‌గా జరిగే ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొంటారు. అయితే సమంత మాదిరిగా పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాల్లో చేయబోతోంది. ‘నాకు ఎంతో ఇష్టమైన నటనని కొనసాగిస్తూ మిమ్మల్ని ఇంకా అలరిస్తూనే ఉంటాను’’ అని కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఈ అమ్మడు ప్రకటించింది. కాజల్ కి కాబోయే భర్త గౌతమ్ నిజానికి కాజల్ కి చిన్ననాటి ఫ్రెండ్. వీరిద్దరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
ముంబయిలో జాన్ కాన్స్ స్కూల్లో ఆతర్వాత టాప్స్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించిన గౌతమ్ .. డిసన్గ్ లివింగ్ అనే ఈ కామర్స్ సెంటర్ నడుపుతున్నారు. హౌస్, రూమ్ డిజైనింగ్ లను ఈ సెంటర్ ద్వారా అందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే గౌతమ్ వ్యక్తిగత పోస్టుల కన్నా తన బిజినెస్ హోమ్ డిజైనింగ్ పోస్టులు ఎక్కువగా కనిపిస్తాయి. హౌస్ గానీ, రూమ్స్ గానీ ఎలా ఉండాలో చెబుతూ రకరకాల డిజైనింగ్స్ పోస్ట్ చేసే గౌతమ్ మంచి రన్నర్ కూడా ముంబయిలో జరిగే మారథాన్ లో పాల్గొంటున్నారు.