మాస్ సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో ?
అక్కినేని హీరో నాగార్జున మాస్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి అప్పట్లో ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. మాస్ అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు. క్లాస్ గా ఉంటూ ,స్టైలిష్ గా వ్యవహరిస్తూ దుమ్మురేపడమే అసలైన మాస్ అని అదే టైటిల్ గా పెట్టి సినిమా తీసి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అన్నపూర్ణ స్టూడియోలో నేనున్నాను మూవీ షూటింగ్ లో ఓ సాంగ్ చిత్రీకరిస్తున్న సమయంలో షూటింగ్ గ్యాప్ వచ్చింది. ఆసమయంలో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తాను డైరెక్టర్ కావాలనుకుంటున్నట్లు చెప్పడంతో ,కథ ఉందా అని నాగ్ అడగడం, వెంటనే కథ లైన్ చెప్పడంతో నాగ్ కి కొత్తగా అన్పించింది. దాంతో గంటసేపు మొత్తం కథ వినేసి,అక్కడే ఉన్న మీడియాతో లారెన్స్ తో నా తదుపరి మూవీ అని నాగ్ ప్రకటించేశాడు. దీంతో కలో నిజమో లారెన్స్ కి అర్ధం కాలేదు. నిజానికి ఈ కథను రజనీకాంత్, చిరంజీవిలకు చెప్పగా చూద్దాం అన్నారు. విజయ్ కి చెప్పాలనుకున్న సమయంలో నాగ్ తో చెప్పడం, ఒకే అవ్వడంతో లారెన్స్ కి ఆనందంతో లక్కీ డే గురువారం కావడంతో ఇష్టమైన రాఘవేంద్ర స్వామికి మనసులో దణ్ణం పెట్టుకుని , నాగ్ కి కూడా దణ్ణం పెట్టాడు.
నాగ్ లో మంచి మాస్ హీరో ఉన్నాడు. పూర్తిగా వినియోగించడంలేదని భావించిన లారెన్స్ పవర్ ఫుల్ పాత్రలో డిజైన్ చేసాడు. ఇండస్ట్రీలో లారెన్స్ డైరెక్టర్ ఏమిటనే గుసగుసలు మామూలే. కథలో పరుచూరి సోదరులు సహకరించి డైలాగ్స్ రాసారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. కత్రినా కైఫ్ ని హీరోయిన్ గా అనుకోగా, రెమ్యునరేషన్ ఎక్కువ కావడంతో జ్యోతికను తీసుకున్నారు. సెకండ్ హీరోయిన్ గా ఛార్మి సెలక్ట్. చిన్న రోల్ కి ప్రకాష్ రాజ్ ఒప్పేసుకున్నాడు. మే7న నేనున్నాను రిలీజ్ అయి,సూపర్ హిట్ అయింది. దీంతో మరింత ఉత్సాహంతో మే మూడవ వారంలో షూటింగ్ ప్రారంభం. సారధి స్టూడియోలో షూటింగ్ కొంత తీసాక అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి అక్కడ షూట్ చేసారు.
రామోజీ ఫిలిం సిటీలో ఫ్లాష్ బ్యాక్, గోవాలో ఛేజింగ్ దృశ్యాలు తీశారు. వంశీ పైడిపల్లి దీనికి అసోసియేటెడ్ డైరెక్టర్ గా చేసాడు. ఓ సాంగ్ షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి వచ్చి కొద్దిసేపు ముచ్చటించారు. మొత్తం 85పనిదినాల్లో షూటింగ్ కంప్లిట్. నవంబర్ 25న ఆడియో రిలీజ్. అక్కినేని నాగేశ్వరరావు, నాగచైతన్య, అఖిల్ వచ్చారు. నాగ్ డాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. సాంగ్స్ సూపర్ హిట్. స్టిల్స్ కూడా సూపర్. 2004డిసెంబర్ 23న 200ప్రింట్స్ తో మూవీ రిలీజ్ అయింది.
సినిమా అన్ని సెంటర్స్ లో సినిమా కి ఫాన్స్ నానా హంగామా చేసారు. పంజాగుట్ట సెంటర్ లో 42అడుగుల నాగ్ కటౌట్ పెట్టారు. విలన్ ఎంట్రీ హాలీవుడ్ లెవెల్లో తీసి, నాగ్ ఎంట్రీ మాత్రం సింపుల్ గా చూపించారు. అయితే ఒక ఫైట్ లో మాత్రం ఫాన్స్ కి పూనకం రప్పించేలా లారెన్స్ తీసాడు. డేట్స్ ఇచ్చి మరీ విలన్ కి భయం చూపించడం, ఛేజింగ్, అద్దాలు పగులగొట్టుకుని రావడం, పెళ్ళిలో జ్యోతిక కూల్ డ్రింక్ ఇవ్వడం , ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ ఫైట్స్ ఇలా అన్ని సీన్స్ ఫాన్స్ కి కొత్తగా అన్పించి బాగా ఆకట్టుకున్నాయి.
లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ పండించడం అలవాటే కనుక, స్టైలిష్ స్టిల్స్ తో అచ్చమైన మాస్ హీరోగా నాగ్ నిలిచాడు. రఘువరన్,తదితరుల నటన అదిరిపోయింది. లారెన్స్ తొలిసినిమాతోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బ్లాక్ బస్టర్ మూవీగా నిల్చి,మొదటి వారం ఆరున్నర కోట్ల షేర్ తెచ్చింది. 190సెంటర్స్ లో 50రోజులు ఆడడం ద్వారా 18కోట్లు షేర్ వసూలు చేసింది. 70సెంటర్స్ లో 100రోజులు ఆడి, 22కోట్ల కు పైగా టోటల్ షేర్ కలెక్ట్ చేసింది. హిందీలో మేరీజంగ్ పేరిట రిలీజై సక్సెస్ అయింది. హిందీ ఛానల్స్ లో కూడా ట్రెండ్ సెట్ చేసింది.