Movies

తెలుగులో హిట్ అయ్యి తమిళంలో ప్లాప్ అయినా ఈ సినిమా ఎన్ని కోట్ల లాస్….?

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ టాలీవుడ్ లో చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రికార్డుల మోతమోగించింది. అయితే ఈ సినిమాను బీటౌట్ చేసే సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో చెర్రీ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది మూవీ రికార్డులను కొల్లగొట్టింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా నెట్ లో లీక్ అయినప్పటికీ దేని దారి దాందే అన్నట్లు ఈ మూవీ మగధీరను క్రాస్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ మూవీని రీమేక్ రైట్స్ కోట్లు వెచ్చించి తీసుకుని లైకా సంస్థ తమిళంలో 2019లో శింబు హీరోగా రీమేక్ చేసి, వంతారాజా వదాన్ వర్వ్ పేరుతొ రిలీజ్ చేసింది. అయితే అక్కడ దారుణంగా డిజాస్టర్ అయింది.

ఈమూవీని 35కోట్లతో నిర్మిస్తే, థియేటరికల్ రైట్స్ 30కోట్లకు అమ్మితే, కేవలం 9 కోట్ల షేర్ మాత్రమే తెచ్చింది. తెలుగులో బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ రీమేక్ చేస్తే ఇంతలా విఫలమవడం ఎవరికీ అంతుబట్టలేదు. కారణాలు విశ్లేషిస్తే పవర్ స్టార్ స్టామినా, త్రివిక్రమ్ పనితనం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అన్నీ కుదిరాయి. కానీ శింబు రేంజ్ ఈ సినిమాకు పనిచేయలేదు.