రొటీన్ కి భిన్నమైన స్టోరీస్ కోసం అన్వేషణ….వర్క్ అవుట్ అవుతాయా…రిస్క్…?
ఇప్పటివరకూ ఏదోరకంగా నడిచినా, ఇప్పటి నుంచి భిన్నమైన కథలతో తెరకెక్కాలని టాలీవుడ్ హీరోస్ ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం అన్వేషణ స్టార్ట్ చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలే కాదు, నేచురల్ స్టార్ నాని లాంటి వాళ్ళు కూడా ఈ జాబితాలో ఉన్నారు. టెంపర్ ,బిజినెస్ మాన్ మూవీస్ చూస్తే తారక్,మహేష్ లు కొంచెం నెగెటివ్ టచ్ లోనే వెళ్లారు. సక్సెస్ కొట్టారు. అంతేకాదు,జై లవకుశ లో రావణ పాత్రతో నెగెటివ్ టచ్ తో చెలరేగిపోయాడు కూడా.
ఇక రీసెంట్ గా సుధీర్ బాబు హీరోగా వచ్చిన మూవీలో నాని నెగెటివ్ రోల్ ఎంచుకోవడం వెనుక నటనకు ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్న వాస్తవం దాగుంది. ఎందుకంటే ఆ సినిమాలో నాని చుట్టూనే కథ నడుస్తుంది. అదేకోవలో బన్నీ నటిస్తున్న పుష్ప మూవీ కూడా ఉంటుందని అంచనా. స్మగ్లింగ్ నేపథ్యంలో మొదటి భాగంలో నెగెటివ్ రోల్ లోనే బన్నీ నటన సాగుతుందని, డిఫరెంట్ గా ఉండడంతో పైగా సుకుమార్ డైరెక్షన్ కావడంతో ఏరికోరి చేస్తున్నాడని టాక్. అందుకే హీరోయిజం చూపించే నెగెటివ్ షేడ్స్ కూడా కల్సి వస్తాయని హీరోలు వెయిట్ చేస్తున్నారు.
కథ బాగుంటే, కథనం బాగోకపోవడం, కథనం బాగుంటే కథ తేడా కొట్టడం కాకుండా అన్నీ కుదరాలని వెయిట్ చేస్తున్నారు. మహా సముద్రం మూవీతో ఇలాంటి నెగెటివ్ రోల్ లోనే శర్వానంద్ కనిపిస్తాడని టాక్. ఆర్ ఎక్స్ 100మూవీ డైరెక్టర్ భూపతి తెరకెక్కించనున్న ఈ మూవీపై శర్వానంద్ ఆశలు పెంచుకున్నాడు. సాహో మూవీ సమయంలో ధూమ్ మూవీలో నెగెటివ్ రోల్ వస్తే ప్రభాస్ వదిలేసి బాధపడుతున్నాడని, ఇపుడు అలాంటి రోల్ కోసం చూస్తున్నాడని టాక్. అయితే హృత్రిక్ రోషన్ మూవీలో నెగెటివ్ రోల్ ని చేసే యోచనలో ప్రభాస్ ఉన్నాడట.