రామ్,నితిన్ సంవత్సరానికి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలుసా ?
ఒకప్పుడు హీరోలు అంటే సినిమాలు చేయడం, వీలయితే క్షణం తీరిక లేకుండా కాల్ షీట్స్ ఇస్తూ ఏడాదికి డజను దాకా సినిమాలు యాక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎన్టీఆర్ , అక్కినేని హయాంలో యాడ్స్ లో యాక్ట్ చేయడం అలవాటు లేదు. కృష్ణ ,శోభన్ బాబు , కృష్ణంరాజు హయాంలో కూడా రెండో కోణం లేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున,వెంకటేష్, ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు, రామ్ చరణ్ ,బన్నీ వంటి వాళ్ళు కూడా యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఇందులో సూపర్ స్టార్ మహేష్ అయితే ఏటా 10కోట్లు యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నాడు అంతేకాకుండా వేరే రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతూ సంపాదన మీద ఫుల్లుగా దృష్టి పెట్టేస్తున్నారు. ఇక చిన్న హీరోలు కూడా సంపాదన మీద దృష్టి పెడుతున్నారు. రామ్ పోతినేని కూడా అదే ఒరవడిలో ఓ యాడ్ లో చేస్తూ,బ్రాండ్ అంబాసిడర్ గా చేసాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక జయం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నితిన్ కూడా ఇప్పుడు యాడ్స్ వైపు అడుగులు వేసాడు. బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకోడానికి అందరూ సన్నద్ధమ వు తున్నట్లే నితిన్ కూడా యాడ్స్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ యాడ్ కి సంబంధించి ఈమధ్య గెటప్ కూడా సోషల్ మీడియాలో స్వయంగా నితిన్ పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. మొత్తం మీద హీరోగా చేస్తూనే యాడ్స్ ద్వారా, వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా నితిన్ కూడా ఇంకా సంపాదన పెంచుకోవాలని చూస్తున్నాడు.