Movies

రమ్య కృష్ణ పారితోషికం ఎంత డిమాండ్ చేస్తుందో….రోజుకి ఎన్ని లక్షల్లో ….?

టాలీవుడ్ లో మూడు దశాబ్డల క్రితం తన గ్లామర్ తో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ తర్వాత నిలదొక్కేసుకుంది. సూత్రధారులు, అల్లుడు గారు సినిమాల్లో ఆమె గ్లామర్ అందరినీ ఆకర్షించడంతో అగ్ర హీరోలందరితో చేసింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున,వెంకటేష్, బాలయ్య ఇలా అందరి సరసన మెప్పించింది. ఇక రజనీకాంత్ తో చేసిన నరసింహం మూవీలో నీలాంబరిగా నెగెటివ్ రోల్ చేసి కూడా గ్లామర్ తో కట్టిపడేసింది.

స్టార్ హీరోయిన్ శకం ముగిశాక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రమ్యకృష్ణ తెలుగు, తమిళ మూవీస్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోవడం విశేషం. ఇక ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి మూవీలో శివగామి పాత్ర తో ఎక్కడలేని క్రేజ్ వచ్చిపడింది. హీరోయిన్ గా ఉన్నప్పుడు రాని క్రేజ్ ఈ మూవీతో వచ్చేయడంతో ఆల్ ఇండియా స్టార్ డంను సొంతం చేసుకుంది. ఆ పాత్ర ప్రభావం వలన ఆమె ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ అందుకునే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపో యిందని చెప్పాలి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో తీస్తున్న ఫైటర్ మూవీలో రమ్యకృష్ణ కీలక రోల్ పోషిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ దేవా కట్టాల కాంబోలో రాబోతున్న మూవీలో కూడా బలమైన పాత్రే చేస్తోందట. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ, తెలుగు భాషల్లో లో మరికొన్ని సినిమాలను కూడా ఈమె చేస్తోంది. అయితే ఈమె రెమ్యునరేషన్ చూసి ప్రొడ్యూసర్స్ హడలిపోతున్నారట. ఒక్క రోజుకు 8 నుండి 10 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నారట. సినిమా కోసం బల్క్ గా డేట్లు కావాలంటే ఈమె పారితోషికం కోట్లలోనే ఉంటుందని టాక్. కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ ను మించి కూడా రెమ్యునరేషన్ ఈమె అందుకుంటోందని టాక్. ఆ పాత్ర కోసం ఆమె కావాలి కనుక ఆమె అడిగిందనంతా సమర్పించుకోవడం తప్ప ప్రొడ్యూసర్స్ కి మరో మార్గం లేదట.