సునీల్ తో జోడి కట్టిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా ?
టాలీవుడ్ కి ఇతర భాషల నుంచి చాలామంది హీరోయిన్స్ గా వస్తుంటారు. అందులో కొందరు ఇండస్ట్రీని ఏలేస్తారు. మరికొందరు మధ్యలో డ్రాప్ అవుతారు. రెండోకోవలోకి చెందిన హీరోయిన్ సలోని అశ్విని. డైరెక్టర్ ఆర్ సూర్యకిరణ్ తెరకెక్కించిన ధన 51 మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులోనే కాకుండా పలు భాషల్లో నటించింది.
తెలుగు,తమిళ ,మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 20సినిమాల్లో చేసిన సలోని అంతగా ప్రాధాన్యత లేని సినిమాలను సెలెక్ట్ చేసుకోవడం వలన దెబ్బతింది. దాంతో సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారిపోయింది. విక్టరీ వెంకటేష్ నటించిన బడీ గార్డ్ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ గా సపోర్టింగ్ యాక్టర్ గా చేసి, సైమా అవార్డు గెలుచుకుంది.
తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు మూవీలో చేసిన సలోని ఆతర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. బరువు పెరగడం వలన సినిమాల్లో ఛాన్స్ లు తగ్గాయని అందరూ అనేమాట. దానికి తోడు కెరీర్ మొదట్లో అనుకున్న విధంగా కథల సెలక్షన్ లో సరిగ్గా వ్యవహరించకపోవడం మైనస్ పాయింట్ గా చెబుతారు. ఇక ప్రస్తుతం ఈమె ముంబయిలో నివాసం ఉంటున్నట్లు టాక్.