ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి
డిఫరెంట్ ప్రేమకథ తో వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో వచ్చిన దేవదాస్ మూవీలో హీరో రామ్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అదే సినిమాలో హీరోయిన్ గా గోవా బ్యూటీ ఇలియానా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్,ఇలియానా కూడా తర్వాత సూపర్ హిట్ మూవీస్ తో దూసుకెళ్లారు. అందరి అగ్ర హీరోల సరసన నటించిన ఇలియానా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్, ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లవర్ బాయ్ తరుణ్, సిద్ధార్ధ ఇలా అందరి సరసన నటించి హిట్స్ అందుకుంది. పోకిరి మూవీ అయితే ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ మూవీలో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. తరచూ విభిన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఆకట్టుకునే ఈ అమ్మడు తాజాగా చిన్ననాటి ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
తెల్లని డ్రెస్ ధరించి, చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో తీయించుకున్న ఫోటోలు గా ఉన్నాయి. దీంతో విపరీతంగా కామెంట్స్, లైక్ లు వస్తున్నాయి. ఈ బ్యూటీ బాలీవుడ్ మీద మోజుతో అక్కడకు వెళ్లి కష్టాలు కొనితెచ్చుకుందని అంటున్నారు. ఇక కొన్నాళ్ళు ప్రేమ పేరుతొ బాయ్ ఫ్రెండ్ తో తిరిగినట్లు గోవా బ్యూటీ మీద ఎన్నో వార్తలు షికారు చేశాయి.