అభిజిత్ వాటికి దూరంగా ఉంటూ మైండ్ గేమ్ ఆడటానికి కారణం ఇదేనట
తెలుగులో ప్రస్తుతం కింగ్ నాగార్జున హోస్ట్ గా స్టార్ మా లో నడుస్తున్న బిగ్ బాస్ 4 సీజన్ 16మంది కంటెస్టెంట్స్ లో స్టార్ట్ అయింది. ఎలిమినేషన్ లో వెళ్లిపోయేవాళ్లు వెళుతుండగా, వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా అవుతున్నాయి. ఇక యాంకర్ లాస్య పేరు షో మొదట్లో బాగా పాపులర్ అయింది. రానురాను సీన్ మారుతోంది. ప్రస్తుతానికి హౌస్ లో అభిజిత్ పేరు బాగా విన్పిస్తోంది. ఇతగాడు మైండ్ గేమ్‌తో మంచి ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. నిజానికి టాలీవుడ్ లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్ .. ఆ తర్వాత మరే సినిమా చేయలేదు.
ఆతర్వాత పెళ్లి గోల అంటూ వెబ్ సిరీస్ చేసినప్పటికీ బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాతే ఇతడికి డిమాండ్ హెచ్చడంతో పాటు బయట కూడా పిఆర్ టీం ఒకటి పని చేస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక హౌస్ లో అఖిల్, సోహైల్, మెహబూబ్ లాంటి వాళ్లు అయితే ఎంతకైనా తెగించేలా కనిపిస్తున్నారు. ఇక షో మొదలైన రోజు నుంచి కూడా ఫిజికల్ టాస్కులకు దూరంగా ఉన్న అభిజిత్ ఫిజికల్ టాస్కులు చేయకపోవడానికి భుజానికి గాయం అవడమేనని కొందరికే తెల్సు.
ఇప్పటికే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో అభితో పాటు నటించిన సుధాకర్ ఈ విషయం గురించి వీడియో చేసాడు. చేయి సమస్య ఉంది కాబట్టే అభి అవన్నీ చేయట్లేదు.. త్వరలోనే పూర్తిగా బ్యాక్ అవుతాడు.. కచ్చితంగా ట్రోఫీతోనే తిరిగొస్తాడని సుధాకర్ చెప్పాడు. అయితే రోబోల టాస్కులో మాత్రం అభిజిత్ అదరగొట్టేసాడు. మిగిలిన వాళ్లు పూర్తిగా బాడీని నమ్ముకుని ఫిజికల్ టాస్క్ లు దంచేస్తుంటే, అభిజిత్ ఫిజికల్ టాస్కులకు దూరంగా ఉంటూ కేవలం మైండ్ గేమ్ మాత్రమే కానిస్తున్నాడు. ఇంకా బిగ్ బాస్ కొనసాగుతుంది కనుక అన్నీ సర్దుకుని,ఫిజికల్ టాస్క్ లు కూడా చేస్తాడా.