Movies

పవర్ స్టార్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు…రోజుకి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్

చేసింది పాతిక సినిమాలే అయినా వందల సినిమాలు చేసిన హీరోల కన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువ ఇమేజ్ తెచ్చుకున్నాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా పవన్ అభిమానించే, ఇంకా చెప్పాలంటే,దేవుడిగా భావించే ఫాన్స్ ఎంతోమంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జనసేన పార్టీ పెట్టి సినిమాలకు దూరంగా ఉండడంతో ఎప్పుడు మళ్ళీ సినిమా లో యాక్ట్ చేస్తాడా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుండేవాళ్లు.

మొత్తానికి ఇటు రాజకీయాల్లో ఉంటూనే అటు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. వరుసపెట్టి సినిమాలు ఒకే చెప్పాడు. హిందీ పింక్ రిమేక్ గా వకీల్ సాబ్ మూవీ చాలావరకూ షూటింగ్ కూడా చేసాక , కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ ఆగిపోయింది. దీంతో నలుగురైదుగురు డైరెక్టర్స్ తో చేయాల్సిన సినిమాలు ఆగిపోయాయి. ఇక వకీల్ సాబ్ కోసం ప్రత్యేక విమానంలో రోజూ షూటింగ్ కి తీసుకొచ్చి తీసుకెళ్లేవారని టాక్ కూడా అప్పట్లో వచ్చింది.

ఇక రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ముట్టజెప్పడానికి ప్రొడ్యూసర్స్ క్యూ కట్టినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇక అయ్యప్పన్ కోషియం అనే మూవీకి రీమేక్ లో నటించడానికి పవన్ ఒకే చెప్పినట్లు… దాదాపు 35నుంచి 45రోజుల షూటింగ్ కి 50కోట్లు ఆఫర్ చేసినట్లు తాజాగా ఓ వార్త వైరల్ అయింది. దీనిపై ఇంకా క్లారిటీ రాకున్నా, ఈ వార్త వింటేనే రోజుకి ఎంత ముడుతుందో, పవన్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. అన్ లాక్ -5 నిబంధనల ప్రకారం సినిమాలకు ఒకే చెప్పడంతో ఇప్పుడు వకీల్ సాబ్ పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.