సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సితార….ఈ ఉంగరం గురించి తెలుసా ?
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తమ చిన్ననాటి జ్ఞాపకాలు ఇతర విశేషాలు షేర్ చేసుకుంటూ ఫాన్స్ ని అలరిస్తున్నారు. ఇక కరోనా లాక్ డౌన్ లో అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు పోటాపోటీగా చెలరేగిపోయారు. సెలబ్రిటీలే కాదు, వారి పిల్లలు కూడా సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ, కూతరు సితార కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే వుంటున్నారు.
వీళ్ళకి సంబందించిన పలు ఫోటోలను తల్లి నమ్రత పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇంస్టాగ్రామ్ లో సితార షేర్ చేసిన ఓ ఫోటో నెటిజన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది. ఉంగరంతో ఉన్న ఫోటో అది. దాని వెనుక కథ గురించి సితారా చెప్పుకొస్తూ ‘ఈసారి దీపావళికి ముందే గిఫ్ట్ అందేసింది. ఇది సాయిబాబా ఉంగరం. మా అమ్మకు ఎనిమిదేళ్ల వయస్సులో వాళ్ళ అమ్మ అంటే మా అమ్మమ్మ ఇచ్చిన ఉంగరం అది. ఇపుడు నాకు గిఫ్ట్ గా ఇచ్చింది అమ్మ’అని వివరించింది.
ఇక ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కల్సి సితార ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ,.. ఎన్నో వీడియోలు పోస్ట్ చేసి లక్షల్లో వ్యూస్ కొట్టేసింది. సరిలేరు నీకెవ్వరూ మూవీలో తమన్నా డాన్స్ చేసిన పాటకు డాన్స్ చేస్తూ చేసిన వీడియో ఈమధ్య జోరుగా వైరల్ అయిన సంగతి తెల్సిందే. మొత్తం మీద సెలబ్రిటీల పిల్లలు సోషల్ మీడియా ను ఓ రేంజ్ లో ఏలేస్తున్నారు.