తెలుగులో బిగ్ బి కోసం క్రియేట్ చేసిన రోల్స్ రిజెక్ట్ చేశారా? కారణం ఏమిటంటే ?
కొన్ని సినిమాలు కథ సమయంలోనే కొన్ని పాత్రలు సృష్టించి, ఆ పాత్రలకు ఫలానా వారే సూటవుతారని నిర్ణయించుకుంటారు. కానీ అలా అనుకున్నవాళ్ళు వివిధ కారణాల వలన యాక్ట్ చేయడం కుదరక వేరే వాళ్ళను సెట్ చేస్తారు. ఇక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ మొత్తం నటించిన మనం మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అనుకున్నట్టే గెస్ట్ రోల్ లో కన్పించాడు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి నటించిన తర్వాత సైరా నరసింహారెడ్డి లో ముఖ్య పాత్ర చేసి మెప్పించారు.
ఇక తాజాగా ప్రభాస్, దీపికా పదుకొనే నటిస్తున్న సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అయితే అంతకుముందు కొన్ని తెలుగులో కొన్ని సినిమాలు చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన కుదరలేదు. క్రియేటివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి సినిమాలో ఒక పాత్ర కోసం ముందుగా అమితాబ్ బచ్చన్ ని అనుకున్నారు. కానీ బిగ్ బికి డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ పాత్ర చేయలేదట. అయితే ఆ పాత్ర ఏంటన్నది బయటకి వెల్లడికాలేదు.
కానీ ఆ మూవీలో మూడు ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. అందులో ఒకటి నాజర్ పాత్ర, మరొకటి ప్రకాష్ రాజ్ పాత్ర, మూడవది సాయాజీ షిండే పాత్ర. మరి ఈ మూడింటిలో నాజర్ పాత్రకి, కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రోల్ కోసమే అమితాబ్ బచ్చన్ ని అనుకుని ఉండొచ్చు. లేదంటే మరో రోల్ క్రియేట్ చేసి తర్వాత తీసేసి ఉండొచ్చనే టాక్ ఉంది. అలాగే ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీలో ఒక ముఖ్య పాత్ర కోసం అమితాబ్ ని సంప్రదిస్తే సున్నితంగా తిరస్కరించారట.