Movies

చిరు సురేఖ గారి పెళ్లి విషయం లో వాళ్ళ ఇంట్లో జరిగిన డిస్కషన్ ఏంటో తెలిస్తే షాక్ !

మెగాస్టార్ చిరంజీవి,సురేఖ గారి పెళ్లి సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ మధ్య అల్లు అరవింద్ గుర్తుకు చేసుకున్నారు. ఇంతకీ మెగాస్టార్ పెళ్లి సమయంలో ఏమి జరిగింది. ఆ విషయంలోకి వస్తే… అల్లు అరవింద్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా చిరంజీవిని ‘ప్రాణం ఖరీదు’ సినిమా ప్రివ్యూలో చూసాను. అప్పటికే ఆయనను సినిమాల్లో చూసి ఉన్నాను కాబట్టి ఈ యువకుడు ఎవరో కానీ బాగా చేసాడే అని అనుకున్నాడు అరవింద్.

అదే తోలి ఇంప్రెషన్. సోదరి సురేఖకు చిరంజీవి ఎలా ఉంటాడని అల్లు రామలింగయ్య ఇంటిలో ప్రశ్నించినప్పుడు, ఇంటిలో డిస్కషన్ పెట్టినప్పుడు మనమే సినిమా పరిశ్రమలో ఉంటూ సినిమా పరిశ్రమలో ఉన్నవారికి చెల్లెలిని ఇవ్వవచ్చా అని చర్చ అనవసరం. అబ్బాయి మంచివాడని ఎవరైనా చెప్పితే చాలని అన్నారు. ఆ విధంగా ఆ నాటి సంగతులను అల్లు అరవింద్ గుర్తుకు చేసుకున్నారు. చిరు నటించిన 150 వ సినిమా విడుదల అయ్యి దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే.