ఆ ఒక్క కారణం వల్లే బాలు గారిని బావ అని పిలవలేదు…కారణం అదే !
తన గానామృతంతో ఎందరి మదిలోనో చెరగని ముద్రవేసుకున్న ఎస్పీ బాలు ఈ లోకం విడిచి వెళ్లినప్పటికీ ఇంకా చాలామంది ఆయనతో అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. దాదాపు 40వేలకు పైగా పాటలు పాడిన ఈ గాన గంధర్వుడు అన్ని భాషల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 50రోజులకు పైగా మృత్యువుతో పోరాడి ఈలోకం వీడివెళ్ళొపోయారు. కెరీర్ పరంగా గానీ, వ్యక్తిగత జీవిత పరంగా గానీ ఎలాంటి మచ్చ లేకుండా సక్సెస్ ఫుల్ జీవితాన్ని సాధించిన బాలు తో గల సంబంధాల గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాను ఈస్థాయిలో ఉండడానికి ఎంతోమంది సంగీత దర్శకులు, రచయితలూ, ప్రొడ్యూసర్లు, హీరోలు ,దర్శకులు కారణమని, తనకు ఓ చంటిపిల్లాడిలా పరిశ్రమలో పెంచి పెద్ద చేసారని బాలు ఎన్నో సార్లు సభాముఖంగా చెప్పుకొచ్చారు కూడా. సొంత టాలెంట్ ఏదీ లేదని, అందరి దయవలన పైకి వచ్చానని కృతజ్ఞతగా చెప్పేవారు. తన ఉన్నతికి దోహాదపడ్డ వాళ్ళ గురించి పలు ఇంటర్యూలో , వివిధ సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బాలు భౌతికంగా లేకున్నా ఎందరో ఆయన్ని తలచుకుంటున్నారు. ఇక తాజాగా బాలుకి స్వయాన బావ శుభలేఖ సుధాకర్ ఇచ్చిన ఇంటర్యూ చూస్తే బాలు గొప్పదనం మరింత తెలుస్తుంది.
అయితే బాలుని ఏనాడూ బావ అని శుభలేఖ సుధాకర్ పిలవలేదు. నిజానికి ఆయన సిస్టర్ ఎస్పీ శైలజతో పెళ్లి కాకముందే బాలు తో అనుబంధం ఉందని సుధాకర్ చెప్పారు. గొప్ప లెజెండరీ సింగర్ కావడంతో ఆయన్ని మేరు పర్వతంలాగానే చూశానని, అందుకే బావ అని పిలవలేనని సుధాకర్ అన్నారు. ‘నా గుండెల్లో పర్వతం లాంటి మనిషిని బావ అని పిలవదల్చుకోలేదు. నా గుండెల్లో ఆయన స్థానాన్ని అలాగే ఉంచుకోవాలని అన్పించింది. సర్ అని ఎంతో మర్యాదగా పీల్చుకోవడం అలవాటు. అందుకే బావ అని ఎప్పుడూ పిలవలేదు, చెప్పుకోలేదు’అని శుభలేఖ సుధాకర్ అన్నారు. ఈమాటలు విన్నాక ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. దీన్నిబట్టి బాలు ఎంతటి ఉన్నత స్థానాన్ని పొందారో వేరే చెప్పక్కర్లేదు.