ప్రసవం అనంతరం పొట్ట తగ్గించుకోవాలంటే ఏమి చేయాలి?
ప్రసవం అనంతరం పొట్ట తగ్గించుకోవాలంటే ఏమి చేయాలి?
ప్రసవం అయిన తర్వాత స్త్రీలో చాలా మార్పులు జరుగుతాయి. వాటిలో ముఖ్యంగా పొట్ట భాగం గురించి చెప్పుకోవాలి. పిల్లలు పుట్టక ముందు ఏ మాత్రం పొట్ట లేకపోయిన,బిడ్డ పుట్టిన తర్వాత పొట్ట బాగా పెరిగిపోతుంది. కొందరిలో ప్రసవం అయిన వెంటనే పొట్ట తగ్గిపోతుంది. మరికొందరికి ప్రసవం అయిన అసలు పొట్ట తగ్గదు.
బిడ్డకు పాలు ఇచ్చే తల్లుల్లో ఈ సమస్య తక్కువగా కనపడుతుంది. అందువలన బిడ్డకు మూడు నెలలు వచ్చే వరకు తల్లి పాలు ఇవ్వటం మంచిది. ఇది బిడ్డ ఆరోగ్యానికి,తల్లికి కూడా మంచిది. తల్లి పాలు ఇవ్వటం వలన అధిక బరువు సమస్యలు,పొట్ట రెండు తగ్గిపోతాయి.
గర్బంతో ఉన్నప్పుడు తల్లి ఎంత పోషకాహారం తీసుకుంటుందో,ప్రసవం అనంతరం కూడా అంతే ఆహారం తీసుకోవాలి. దీని వలన కూడా పొట్ట తగ్గించుకొనే అవకాశం ఉంది. బెల్ట్ పెట్టుకోవటం వలన ఎటువంటి ఉపయోగం ఉండదని నిపుణులు చెప్పుతున్నారు. అయితే ఈ బెల్ట్ వాడాలన్న బిడ్డకు మూడు నెలలు వచ్చే వరకు ఆగాలి.
ప్రసవం అయిన తర్వాత ఎంత తొందరగా నడవటం మొదలు పెడితే అంత మంచిది. రోజులో కనీసం అరగంట నడవాలి. అయితే రన్నింగ్,జాగింగ్ వంటివి చేసేటప్పుడు మాత్రం డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
కార్డియో వ్యాయామాలు రోజులో కనీసం 20 నిముషాలు చేయాలి. అలాగే పెల్విక్ వ్యాయామాలు చేయటం కూడా తప్పనిసరి. ఈ వ్యాయామాలు రోజులో వీలైనన్ని సార్లు చేస్తే మంచిది. జిమ్ కి వెళ్ళాలంటే తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.