వైల్డ్ కార్డు తో జబర్దస్త్ కంటెస్టెంట్ హౌస్ లోకి వస్తున్నాడా…?
మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తిచేసుకున్న తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ షో ప్రస్తుతం నాల్గో సీజన్ సాగుతోంది. ఇప్పటికే ఐదు వారాలు పూర్తయిపోయింది. అంతేకాదు ఆరో వారం లో సగం పైనే పూర్తయింది. 16మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ చేసినా పెద్దగా పేరున్నవాళ్ళు లేరనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రయోగాలు చేస్తున్నారు. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసున్న ఈషోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా జబర్డస్చ్ కమెడియన్ రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఎందుకంటే తెలంగాణా యాసతో దుమ్మురేపిన సీనియర్ సిటిజన్ ,యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఐదో వారంలో హౌస్ నుంచి తనకు తానుగా బయటకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత నవ్వుల రాణి జోర్దార్ సుజాత కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఓపక్క ఎలిమినేషన్స్ ప్రక్రియ నడిపిస్తూనే మరోపక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో కంటెస్టెంట్స్ కి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ పద్దతిలో ఇప్పటికే ముక్కు అవినాష్‌తో పాటుకుమార్ సాయితో పాటు స్వాతి దీక్షిత్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేసారు . ఇందులో స్వాతి దీక్షిత్.. ఎంత వేగంగా హౌస్‌లోకి వచ్చిందో.. అంతే వేగంగా ఎలిమినేట్ అయింది.
ఇక హౌస్‌లో అవినాష్ తనదైన శైలిలో అందరినీ నవ్విస్తూ ఉన్నాడు. మరోవైపు సాయి కూడా తనకు తోచిన రీతిలో హౌస్ మేట్స్‌ను అలరిస్తున్నాడు. మొత్తం మీద బిగ్‌బాస్‌లో ఇప్పటికే ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా నాల్గో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ జోరుగానే నడుస్తోంది. జబర్ధస్త్‌లో ఫేమసైనా ఓ కంటెస్టెంట్‌ను హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడట. పైకి ఎవరో చెప్పక పోయినప్పటికీ చాలా పేర్లు వినిపిస్తున్నాయి. నిజానికి గతంలో కాంట్రాక్ట్ చేసిన హైపర్ ఆది వంటి వాళ్ళు బిగ్ బాస్ వదిలి బిగ్ బాస్ లోకి వచ్చేది లేదని చెప్పేసినట్లు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఎవరిని తీసుకు రాబోతున్నారో త్వరలోనే తేలనుంది.