Movies

సేఫ్ జోన్ లో నిశ్శబ్డం నిజమేనా…?

అరుంధతి, భాగమతి, సైజ్ జీరో వంటి మూవీస్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న స్వీటీ అనుష్క ఇష్టపడి చేసిన మూవీ నిశ్శబ్దం. పాత్ర పరంగా ఎలివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని ఒప్పుకుని చేసింది. హేమంత్ మధుకర్ డైక్రెక్షన్ లో అంత్యంత సాంకేతిక విలువలు జోడించి తీసిన ఈ మూవీలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్ సేన్ వంటి వాళ్ళు ఇందులో నటించడం ఇంకా క్రేజ్ పెరిగింది.

మాధవన్ తదితరులు నటించిన నిశ్శబ్దం మూవీ కోసం అనుష్క సైన్ భాష కూడా నేర్చుకుంది. ఇక షూటింగ్ పూర్తయినప్పటికీ రిలీజ్ కి వచ్చేసరికి కరోనా వచ్చి పడింది. దీంతో విధించిన లాక్ డౌన్ తో మొత్తం పరిస్థితి మొత్తం తలకిందులైంది. ఇన్నాళ్లు వేచివున్నా ఇంకా థియేటర్లు తీస్తారో లేదోననే అనుమానంతో ఓటిటి వేదికగా ఈ మూవీని మూవీ మేకర్స్ అక్టోబర్ 2న రిలీజ్ చేసారు.

షూటింగ్స్ పూర్తయిన సినిమాలు చాలా ఉన్నా నిశ్శబ్దం మూవీ రిలీజ్ కావడం ఆవిధంగా చిత్ర యూనిట్ ఆనందంగానే ఉన్నారు. అమెజాన్ లో భారీగా వ్యూస్ వచ్చాయని టాక్. అందుకే అందరూ హ్యాపీ గా ఉన్నారన్న టాక్ వస్తోంది. అంజలి, శైలిని పాండే, సుబ్బరాజ్ వంటి నటులు నటించిన ఈ మూవీని పీపుల్ మీడియా పతాకంపై తెరకెక్కించారు. సమీక్షకులను మెప్పించని ఈ మూవీ వీక్షకులను ఆకట్టుకుందన్న మాట వినిపిస్తోంది. సేఫ్ ప్రాజెక్ట్ గా నిలిచిందని అంటున్నారు.