రెండింటిలో ఏది గొప్ప…??
సంక్రాంతి కానుకగా ఇద్దరు బడా హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడంతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూశారు. ఇన్నాళ్ళకు ఆ రోజు రానే వచ్చింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన ‘ఖైదీ నంబర్ 150’తో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడమే కాకుండా అందరి దగ్గరా బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. అటు ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపుతున్న అన్నయ్య సినిమా కేవలం ఒక్క రోజులోనే 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు చెప్తున్నారు ట్రేడ్ వర్గాలు. ముందుగానే చిరు సినిమాకి 100కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు.
ఇప్పటికే 30 కోట్లుకి పైగా వచ్చేశాయి కాబట్టి, మిగతా 70కోట్లు రావడానికి పెద్ద రిస్క్ ఏమీ లేదంటున్నారు. ఇక బాలయ్య శాతకర్ణి విషయానికొస్తే..పూర్తి చారిత్రాత్మక చిత్రం కావడంతో ఇప్పటికే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఇప్పటికే మొదటి షో పడ్డ శాతకర్ణికి పాజిటీవ్ టాక్ రాగా, కలెక్షన్స్ పరంగా మాత్రం మెగాస్టార్ సినిమాతో పోటీ పడగలడా అనే అనుమానం వస్తుంది.
అంతేకాకుండా మొదటిరోజు శాతకర్ణికి 15 నుంచి 20కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక లాంగ్ రన్ లో మాత్రం 60 కోట్ల వరకు వచ్చి ఆగిపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి ఏవిధంగా చూసుకున్నా సరే..మెగాస్టార్ తో బాలయ్య బాక్సాఫీస్ వద్ద నెగ్గలేడనే అంటున్నారు. మరి దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.