సూర్య నమస్కారాలు ఎలా చేస్తే పుణ్యం లభిస్తుంది.?
సూర్యనమస్కారం చేసేవారిని ,సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేవారిని మనం చూస్తుంటాం.కానీ మనం నిద్ర లేచినప్పుడో,మనకు కుదిరినప్పుడో కాకుండా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంలో కొన్ని నియమాలు పాటించాలి.హిందూ మతంలో పూజా విదానాలన్నింటిలో అంతర్గతంగా ఆరోగ్య సూత్రాలు పొందుపరచబడినాయి.సుర్యారాదనలో కూడా ఎన్నో ఆరోగ్యాభివృద్ధిని కలిగించే అంశాలు దాగిఉన్నాయి.
ప్రతిరోజు ఉదయమే అనగా సూర్యోదయం అయిన గంటలోపే సూర్యునికి అర్గ్యం ఇవ్వాలి.వేకువనే నిద్ర లేవడం వలన రోజంతా ఉత్సాహంగా ఉండచ్చును.
• స్నానం చేసి,ఉతికిన బట్టలు వేసుకుని మాత్రమే ఈకార్యం చేయాలి.స్నానంచేయలేని వారు కనీసం కాళ్లు,చేతులు మరియు మొఖం శుభ్రంచేసుకుని ఇవ్వాలి.
• సూర్యునికి సమర్పించే వాటర్ ఏ పాత్రలో బడితే అందులో తీసుకోకూడదు.రాగి చెంబు శ్రేష్టమైనది.ఈ నీటికి తేనే లేదా పంచదార కలపవలేను.
• తూర్పుదిక్కుగా నమస్కరించి చేతులు చాచి నెమ్మదిగా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి.ఆ విదంగా చేయడం వల్ల సూర్య కిరణాలు వాటర్ ను తాకి ఆ కిరణాలు మన శరీరం ఆద్యంతాన్ని ప్రభావితం చేస్తాయి.
• ఆదివారం నాడు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది.దీనివలన ఆర్దిక ,ఆరోగ్య సమస్యలనుండి బయటపడవచ్చు.ఆదివారం సూర్యునికి సంభందించిన వారం,దీన్నే రవివారం అని పిలుస్తాం.ఇంగ్లీష్ లో కూడా సన్ డే అని సూర్యుని ప్రాముఖ్యాన్ని చెప్పకనే చెప్పారు.
• సూర్య నమస్కారలవలన , శరీరాన్ని తాకే వెచ్చని అరుణ కాంతితో చర్మము కాంతివంతంగా మారుతుంది. ఎముకలు బలపడి శారీరక ధృడత్వం కలుగుతుంది.
• అర్ఘ్యం ఇచ్చే రోజున ఉపవాస మూలంగా శరీరంతర్భాగాలకు తగిన విశ్రాంతి లభిస్తుంది. తద్వారా జీర్ణశక్తి పెరిగి, శరీరానికి కావలసిన పోషకాలు లభించడం వలన చురుకుగా ఉండవచ్చును.ఇలా దైనందిన జీవితాన్ని సుఖమయం చేసుకొనే అనేక ఆవశ్యక సూత్రాలను పూజ విధానాల ద్వారా భావి తరాలకు అందించారు మన పూర్వీకులు.ఏ తరానికైనా, కాలానికైనా సరిపడే విధంగా వారు రూపొందించి అందించిన విధివిధానాలను సరైన విధంగా పాటించి మన జీవితాలలో సుఖశాంతులను నెలకొల్పుకోవడం మన బాద్యత.