కన్నీళ్లు పెట్టిస్తున్న తాగుబోతు రమేష్ రియల్ లైఫ్
తెలుగు కమెడియన్ లలో మందు అనగానే గుర్తుకువచ్చే పేరు తాగుబోతు రమేష్. తెలుగు కమెడియన్ లలో తన మార్క్ నటనతో నవ్విస్తూ దూసుకుపోతున్న తాగుబోతు రమేష్ జీవితమే ఒక కష్టాల కడలి. రమేష్ కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో 25 నవంబర్ 1981లో జన్మించాడు. అతని తండ్రి సింగరేణి కాలరీస్ కంపెనీ వద్ద ఒక ఉద్యోగి మరియు అతని తల్లి గృహిణి. రమేష్ చిన్నతనంలో తన తండ్రి మందు తాగి రమేష్ వాల్ల అమ్మను కొట్టడం చేసేవాడు. రమేష్ తన తల్లిని నవ్వించడానికి తన తండ్రిలాగా తాగినట్టు నటించడం చేసేవాడు అలా చేసి తన తల్లిని నవ్వించేవాడు.
రమేష్ ఆ తరువాత మిమిక్రీ నేర్చుకొని అతని పట్టణంలో ప్రదర్శనలు నిర్వహించేవాడు. అతనికి తాగుబోతు పాత్రలను చేసి ప్రసిద్ధి చెందింన బెంగాలీ హాస్యనటుడు జోరు ముఖర్జీ స్ఫూర్తి అని రమేష్ చెప్తువుంటాడు.
సినిమా పరిశ్రమలోనికి ప్రవేశించడానికి ముందు రమేష్ 10 సంవత్సరాలు ఒక భవనంలో సూపర్వైజర్గా పని చేసాడు . తన తల్లిదండ్రుల మరణం మరియు సోదరి వివాహం తర్వాత అతను తన కెరీర్ ని నటనా జీవితంగా ఎంచుకున్నాడు. 2005 లో అతను హైదరాబాద్ లో అక్కినేని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నాడు.అక్కడ ధనరాజ్,వేణు, చంద్ర లతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది ఇప్పుడు విరు నలుగురు మంచి స్నేహితులు.
2006 లో అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి నటనలో శిక్షణ తిసుకుంటూవుండగా డైరెక్టర్ సుకుమార్ తన జగడం సినిమాలో ఒక చిన్న పాత్రకు అవకాశం ఇచ్చాడు. ఇది రమేష్ మొదటి చలన చిత్రం. జగడం సినిమా తరువాత రమేష్ కు అవకాశాలు దొరకలేదు. ఈ సమయంలోనే రమేష్ కు ప్రముఖ తెలుగు నటుడు ఉత్తేజ్ తో పరిచయం ఏర్పడింది. ఉత్తేజ్ తెలుగు సినిమా టాప్ డైరెక్టర్ కృష్ణ వంశీ కి రమేష్ ని పరిచయం చేసారు .
వంశీ తన మహాత్మా సినిమాలో ఒక తాగుబోతు పాత్రకు అతన్ని ఎంపిక చేసారు . ఈ చిత్రం తన కెరీర్ లో ఒక ప్రధాన మలుపుగా మారింది . మహాత్మా లో సినిమా లోని రమేష్ నటనను చూసిన నందిని రెడ్డి తన అలా మొదలయింది సినిమాలోని తాగుబోతు పాత్ర కోసం రమేష్ ని ఎంపిక చేసుకుంది . అలా మొదలయింది సినిమాలో గౌతమ్ అనే తాగుబోతు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో సినీప్రియులు మధ్య చాలా ప్రాచుర్యం పొందింది.
ఆ సినిమా విజయం తరువాత తెలుగులో టాప్ కమెడియన్ గా ఎదిగారు తాగుబోతు రమేష్ ఆ చిత్రం నుండి అతను సాధారణంగా “తాగుబోతు రమేష్” అనే పేరే తన పేరు అయ్యింది ఇప్పుడు రమేష్ చేస్తున్న సినిమాలో ఎక్కువగా తాగుబోతు వేషాలే ఎక్కువ. తన నటన చూస్తే వీడు నిజంగా మందు తాగి చేస్తున్నాడా అనే లాగా తన నటన ఉంటుంది. కాని రమేష్ కి మందు అలవాటు లేదు.రమేష్ కి 25 మే 2015 తేదిన స్వాతితో వివాహం జరిగింది.ఇప్పుడు తన సినిమాలతో నిమిషం కూడా తీరిక లేకుండా వున్నాడు తాగుబోతు రమేష్.