Health

చిన్నారులకు ఎక్కువ ఉప్పు వాడుతున్నారా… మిస్ కాకుండా చూడండి

మనం ప్రతిరోజు వంటల్లో ఉప్పు తప్పనిసరిగా వేస్తాం ఉప్పు లేకపోతే అసలు ఆహారం తీసుకోలేము మనం ఏ కూర చేసినా ఏ వంటకం చేసినా తప్పనిసరిగా ఉండాలి ఉప్పు లేకపోతే అసలుతినలేము ఉప్పు సరైన మోతాదులో ఉంటేనే మన ఆరోగ్యానికి మంచిది ఉప్పు ఎక్కువైనా తక్కువైనా మన ఆరోగ్యానికి సమస్యలు వస్తాయి అయితే పిల్లలకు ఉప్పును ఎక్కువగా పెట్టకూడదు. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు పిల్లలకు పెడితే వారి శారీరక మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది అంట కాబట్టి సరైన మోతాదులో పెట్టాలి ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు కిడ్నీలో రాళ్లు ఏర్పడటం శరీరంలో నీటి శాతం పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఏ వయసు వారు ఎంత మోతాదులో ఉప్పు తీసుకోవాలో తెలుసుకుందాం

1-3 సంవత్సరాల లోపు పిల్లలకు మూడు గ్రాములు, నాలుగు నుంచి ఆరేళ్ళ వయసు లోపు ఉన్నవారికి మూడు గ్రాములు, ఏడేళ్ల నుంచి పదేళ్ల వారికీ ఐదు గ్రాములు ఉప్పు మాత్రమే ఇవ్వాలట.కానీ మనం.పిల్లలకు ఇష్టమైన ఆహారం అని ఫాస్ట్ ఫుడ్స్ ఓ రేంజ్ లో చేసి పెట్టేస్తున్నారు.ఇక కురుకురే అని, పాస్తా అని, మ్యాగీ అని అన్ని ఉప్పు ఉన్న ఆహారాన్ని ఓ రేంజ్ లో పెడుతున్నారు.దీని వల్ల పిల్లల ఆరోగ్యం దారుణంగా దెబ్బ తింటుందట.