MoviesTollywood news in telugu

Pawan Kalyan:పవన్ కళ్యాణ్ సిక్స్ ప్యాక్ చేయకపోవడానికి అసలు కారణం ఇదే

Pawan Kalyan Six Pack Body :టాలీవుడ్ లో చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ చేసి అభిమానుల మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం సిక్స్ ప్యాక్ హవా తగ్గిన 4 సంవత్సరాల క్రితం సిక్స్ ప్యాక్ కోసం నానా తంటాలు పడ్డారు.

సిక్స్ ప్యాక్ అనేది సినిమా విజయం మీద పెద్దగా ప్రభావం చూపకపోయినా అభిమానులు సినిమాను మళ్ళీ మళ్ళీ చూడాలనే ఉద్దేశంతో కొంతమంది హీరోలు సిక్స్ ప్యాక్ తో అలరించారు.

ఎంతమంది హీరోలు సిక్స్ ప్యాక్ చేసిన అలాగే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు సిక్స్ ప్యాక్ చేసిన సరే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు సిక్స్ ప్యాక్ లో కనబడలేదు. అభిమానులు కోరుకుంటున్న సరే పవన్ ఎప్పుడు సిక్స్ ప్యాక్ వైపు వెళ్లలేదు.

ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో పవన్ ఈ విషయంపై స్పందిస్తూ కండలు పెంచడం సులభమే అని ధైర్యం అనే బలం ముఖ్యమని అందుకే కండబలం కన్నా గుండె ధైర్యం ముఖ్యమని చెప్పుకొచ్చారు అందుకే సిక్స్ ప్యాక్ ట్రై చేయలేదని చెప్పారు.