సమంతBigg Boss హోస్టింగ్ సమయంలో కట్టుకున్న చీర ధర ఎంతో?
Samantha Hosting Saree Cost:దసరా రోజున బిగ్ బాస్ షో ను సమంత హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దసరా రోజున మూడు గంటల పాటు హోస్టింగ్ చేసింది. ఇప్పటివరకు సినిమాల్లోనే కనిపించిన అక్కినేని కోడలు సమంత మొదటిసారిగా బిగ్ బాస్ షో ద్వారా హోస్ట్ గా కనిపించి అభిమానుల మన్ననలు పొందింది. వచ్చీరాని తెలుగు తో క్యూట్ గా మాట్లాడి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆరోజు సమంతా కట్టుకున్న చీర గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ చీరను క్షితిజ్ జలోరి అనే డిజైనర్ డిజైన్ చేసి ఇచ్చారు.ఇకపోతే ఈ చీర ధర 44, 800 రూపాయలుగా తెలుస్తోంది.చీర ఖరీదు ఎక్కువైనా ఆ చీరలో అక్కినేని సమంత అచ్చ తెలుగు అమ్మాయిల కనపడడం అందరిని మెప్పించింది.