కార్తీకమాసంలో దీపారాధన మహిమ
Karthika Masam Deepam :పూర్వం పాంచాలదేశాన్ని పాలించే మహారాజు కుబేరుడిని… హోదాకు మించిన ఆస్తులు వున్నప్పటికీ అతనికి కుమారులు లేని కారణంగా కుంగిపోతూ, ఆవేదనతో తపస్సు చేశాడు. అలా చేస్తున్న మధ్యకాలంలో పిప్పలుడు అనే ముని అటుగా వస్తాడు.
అతడు ఆ తపస్సు ఎందుకు చేస్తున్నాడు అడిగి తెలుసుకుంటాడు. అప్పుడా ముని… ‘‘ఓ రాజా! ఈ మాత్రం దానికి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కార్తీకమాసంలో వ్రతాన్ని ఆచరించి, బ్రాహ్మణులకు దీప దాన, దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది’’ అని చెబుతాడు.
ఆ మాటలు విన్న కుబేరుడు తక్షణమే తన పట్టణానికి చేరుకుని, కార్తీక వ్రతాన్ని ఆచరించి.. దీపాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. దాంతో అతని మహారాణి నెలతప్పి యుక్తకాలంలో మగశిశువుకు జన్మినచ్చింది. ఆ రాజా దంపతులు వారి పుత్రుడికి ‘‘శత్రుజిత్తు’’ అనే పేరు పెట్టారు.
* దీపదాన మంత్రం
” సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చు భావాహం !
దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ !! “