Movies

ఆహా కోసం బన్నీ ఎంత పారితోషికం తీసుకున్నాడు తెలుసా ?

Allu arjun remuneration for aha :అల్లు అరవింద్ ఆహా ప్రారంభించి దాదాపుగా తొమ్మిది నెలలు కావస్తోంది తొమ్మిది నెలల కాలంలో కరోనా లాక్ డౌన్ ఉన్నాసరే ఆశించిన స్థాయిలో కంటెంట్ విషయంలో ఆకట్టుకోలేకపోయింది ఆహా. దాంతో మరిన్ని ఎక్కువ షోలను ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీసుకురావాలి అని ఒక భారీ ఈవెంట్ నిర్వహించి మరీ ప్రకటించింది.

ఆహా కు మొన్నటి వరకు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవాడు ఇప్పుడు ఆ స్థానంలో అల్లు అర్జున్ వచ్చాడు అల్లుఅర్జున్ తో ఇప్పటికే యాడ్ చేసి రిలీజ్ చేశారు ఈ యాడ్ కోసం అల్లు అర్జున్ దాదాపు 5 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఆహా అల్లు అరవింద్ దే కదా మరి అల్లు అర్జున్ పారితోషికం ఎందుకు తీసుకున్నాడు అని ఆలోచిస్తున్నారా. ఆ విషయానికి వస్తే ఆహా అనేది కేవలం అల్లు వారిది మాత్రమే కాదు.ఆహాలో మైహోమ్స్‌ వారు మరియు దిల్‌ రాజు కూతురు అల్లుడు కూడా పెట్టుబడి పెట్టారు. అందుకే బన్నీ ఏదైనా బ్రాండ్‌ కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తే ఎంత పారితోషికం తీసుకుంటాడో అంతే ఆహాకు కూడా అందుకున్నాడు.