మౌత్ వాష్ తో అర నిమిషాల్లో కరోనా హతం… నిజం ఎంత?
coronavirus :కరోనా మహమ్మారి వచ్చి దాదాపుగా 9 నెలలు కావస్తున్నా ఇంకా వ్యాక్సిన్ రాకపోవటంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. కరోనా గురించి పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు ఆ పరిశోధనలో రోజుకొక విషయం తెలుస్తుంది. మనలో చాలామంది మౌత్ వాష్ వాడుతూ ఉంటారు ఆ మౌత్ వాష్ కరోనా వైరస్ ని 30 second లోనే హతమారుస్తూ ఉందని తేలింది మనకు అందుబాటులో ఉండే మౌత్ వాష్ బాగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు. లాలాజలంలోని వైరస్ని మౌత్ వాష్ చంపగలదు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా అంతానికి చికిత్సలో మౌత్ వాష్ వాడక పోవటానికి కారణం ఏమిటంటే మౌత్ వాష్ శ్వాసనాళాల్లో మరియు ఊపిరితిత్తుల్లో పంపించడం కుదరదని పరిశోధకులు అంటున్నారు. శరీరంలో వైరస్ స్థాయిలను తగ్గించడానికి సీపీసీ ఆధారిత మౌత్ వాష్ లు బాగా పని చేయగలవని వారు పేర్కొంటున్నారు.పంటి చిగుళ్ల వ్యాధి కోసం తయారు చేసుకున్న కొన్ని మౌత్ వాష్ లు కరోనా వైరస్ నిర్ములన చేయగలవని తాజా అధ్యయనాలు వెల్లడవుతున్నాయి.అయితే ఈ పరిశోధన సంబంధించి ఇంకా ఎక్కడ పూర్తి సమాచారాన్ని ప్రచురించలేదు.కేవలం సాధారణ పరిస్థితుల నేపథ్యంలో భాగంగా ఈ వివరాలు బయటకు వచ్చాయి.