పవన్ సినిమాకు త్రివిక్రమ్ ఎన్ని కోట్లు తీసు కుంటున్నాడో తెలుసా ?
Trivikram shocking remuneration : టాలీవుడ్ లో వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలలో రామ్ చరణ్ ప్రభాస్ మినహా అందరితోనూ చేశాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా అయ్యప్పనుము కోషిమం రీమేక్ సినిమా కోసం రచన డైలాగ్స్ అందించే పనిలో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ గా నే కాకుండా రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ పవన్ సినిమా కోసం రచన సహకారం డైలాగ్స్ కోసం కేవలం పది కోట్ల రూపాయలను తీసుకుంటున్నాడట
ప్రస్తుతం ఫిలింనగర్ లో ఇదే హాట్ టాపిక్ గా సాగుతోంది.మొదట ఈ సినిమాను యంగ్ జనరేషన్ హీరో తో తక్కువ బడ్జెట్లో చేయాలని నిర్మాత అనుకున్నారట ఆ తర్వాత పవన్ పిక్స్ అయ్యాక త్రివిక్రమ్ స్క్రిప్ట్ డైలాగ్ అందిస్తే సినిమాకి ప్లస్ అవుతుందని నిర్మాతలు భావించి 10 కోట్లు ఇవ్వడానికి సిద్ద పడ్డారట. సినిమా విడుదలయ్యాక వచ్చిన షేర్ నుంచి త్రివిక్రమ్ తన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.