ప్రముఖ నటి రజిత ఎవరి కూతురో తెలుసా…ఆమె కూడా హీరోయిన్…?
సినిమాల్లో హీరో హీరోయిన్స్ తర్వాత అంతగా ప్రాధాన్యత గల పాత్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసేవాళ్ళకి పాత్రను బట్టి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. కనిపించేది తక్కువ సమయం అయినా వీళ్ళు లేకుంటే ఊహించుకోలేం. క్యారెక్టర్ ఆర్టిస్టులుంటేనే సినిమాలు బాగుంటాయని అంటారు. అంతగా ప్రాచుర్యం పొందాయి. అందులో ముఖ్యంగా ఇటీవల అత్తారింటికి దారేది మూవీలో హీరోయిన్ అత్తపాత్రలో నటించిన రజిత ఒకరు.
దాదాపు 400 కు పైగా మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన రజిత ఒకప్పుడు ఒడియాలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత 35ఏళ్లుగా తెలుగులో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయడంతో పాటు సీరియల్స్ లో కూడా మంచి నటిగా రాణిస్తోంది. మల్లీశ్వరి, కబడ్డీ కబడ్డీ ,ప్రేమంటే ఇదేరా , జేమ్స్ బ్యాండ్ వంటి ఎన్నో సినిమాల్లో తన నటనతో అలరించింది.
రజిత తల్లి కూడా నటిగా రాణించిందని చాలామందికి తెలీదు. కానీ ఒకప్పటి సినిమా, సీరియల్స్ లో చేసిన ఆమె అందరికీ పరిచయమే. 100డైలీ సీరియల్స్ లో నటించి, సినిమాల్లో కూడా నటించిన కృష్ణవేణి తెలుసుగా. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, తదితర స్టార్ హీరోల సినిమాల్లో తల్లి,వదిన తదితర పాత్రల్లో నటించింది. రాజచందర్ ని ప్రేమించి పెళ్లాడింది. కృష్ణవేణి సోదరి కూతురే రజిత. మొత్తానికి నట వారసత్వాన్ని అందిపుచ్చుకుంది.