Movies

టాలీవుడ్ ని ఏలుతున్న 25 మంది బ్రదర్స్ ని చూడండి

Famous Siblings Rule Film Industry : సినిమా ఇండస్త్రీలో అన్నదమ్ములు అనగానే చిరంజీవి బ్రదర్స్ అనుకుంటాం కానీ చాలామంది ఉన్నారు. వివిధ రకాలుగా ఇండస్ట్రీలోనే రాణిస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ హీరోలుగా ఉంటె, నాగబాబు క్యారెక్టర్ యాక్టర్ గా, నిర్మాతగా రాణిస్తున్నారు. చిరు తమ్ముడిగా వచ్చినా, సొంతంగా పవన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇద్దరూ రాజకీయాల్లో అడుగుపెట్టినవాళ్ళే. బాలయ్య, హరికృష్ణ ఇద్దరూ బాలనటులుగా చేసారు. బాలయ్య స్టార్ హీరోగా ఉన్నాడు. హరికృష్ణ కొన్ని సినిమాల్లో హీరోగా, కొన్నింటిలో క్యారెక్టర్ యాక్టర్ గా చేసి రాణించారు. రాజకీయాల్లో కూడా ఇద్దరూ ప్రజాప్రతినిధులయ్యారు. సాయికుమార్, రవిశంకర్ బ్రదర్స్ ఇద్దరూ నటులుగా డబ్బింగ్ కింగ్ లుగా రాణిస్తున్నారు.

రామానాయుడు కుమారుడు వెంకటేష్ హీరోగా రాణిస్తుంటే, పెద్ద కొడుకు సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. సురేష్ బాబు తనయుడు రానా కూడా సక్సెస్ ఫుల్ గా ఉన్నాడు. రానా సోదరుడు అభిరాం ఇండస్ట్రీకి పరిచయం కావాల్సి ఉంది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సూర్య, కార్తీ బ్రదర్స్ ఇద్దరూ రాణిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తనయులు రమేష్ బాబు ఒకప్పుడు హీరోగా పలు సినిమాలు చేసాడు. ఇప్పుడు అయన తమ్ముడు మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు. నందమూరి హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ హీరోలుగా రాణిస్తుంటే, జూనియర్ క్రేజీ హీరోగా మారాడు. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గా కూడా ఉంటున్నాడు.

నాగార్జున తనయులు నాగచైతన్య మంచి హీరోగా నిలబడుతున్నాడు. అయితే అఖిల్ మూడు సినిమాలు చేసినా ఇంకా హిట్ కోసం చూస్తున్నాడు. రవితేజా మాస్ మహారాజుగా రాణిస్తుంటే, తమ్ముళ్లు భరత్,రఘు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. డైరెక్టర్ ఈవీవీ తనయులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగి స్టైలిష్ స్టార్ అయ్యాడు. ఇక బన్నీ తమ్ముడు శిరీష్ కూడా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ గా పలు సినిమాలతో దూసుకె ళ్తుంటే అతడి సోదరు ఆనంద్ కూడా ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటు న్నాడు.

చిరు తనయుడు చరణ్ వరుస హిట్స్ అందుకుంటుంటే, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా హిట్స్ కొడుతున్నాడు. సాయిధరమ్ తేజ్ పలు సినిమాలతో బిజీగా మారగా, అతడి సోదరుడు వైష్ణవ తేజ్ ఉప్పెన మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. మంచు విష్ణు,మనోజ్ బ్రదర్స్ హీరోలుగా పలు సినిమాలు చేసినా ఇప్పుడు హిట్ కోసం చూస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, సాయి గణేష్ బ్రదర్స్ లో శ్రీనివాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకోగా, సాయి హీరోగా రాబోతున్నాడు. తమిళంలో సెల్వ రాఘవన్ పెద్ద డైరెక్టర్ కాగా, తమ్ముడు ధనుష్ హీరోగా రాణిస్తున్నాడు.