Movies

ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తు పట్టారా…అమ్మ,నాన్న ఇద్దరూ నటులే…ఎవరో ?

96 Child artist :పేరెంట్స్ సినిమా రంగంలో ఉంటె, అదే చాన్సనుకుని వాళ్ళ పిల్లలు కూడా ఎంట్రీ ఇచ్చి సినిమా రంగాన్ని దున్నేసిన వాళ్ళు, ఇంకా రాణిస్తున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో దేవదర్శిని, చేతన్ .. ఇద్దరూ సినిమా రంగంలోనే కాదు, టివి సీరియల్స్ లో కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీళ్ళ కూతురు కూడా నట వారసత్వాన్ని పుణికిపుచ్చకుని ,చైల్డ్ ఆర్టిస్ట్ గా సత్తా చాటింది.

ఆమె ఎవరో కాదు, నియతి. తమిళంలో దేవదర్శిని యాంకర్ గా , నటిగా, సీరియల్ నటిగా లీడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లేడీ కమెడియన్ గా తమిళ సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చకుంది. చేతన్ కూడా పలు సీరియల్స్ లో నటించి, సినిమాల్లో కూడా సపోర్టింగ్ యాక్టర్ గా రాణించాడు. ఇక నియతి కూడా చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టింది.

విజయ సేతుపతి, త్రిష కలిపి నటించిన 96సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన నియతి చిన్నప్పటి త్రిష పాత్ర చేసి మెప్పించింది. ఇదే సినిమా తెలుగులో జాను పేరుతొ రీమేక్ అయింది. తెలుగులో సమంత చిన్నప్పటి ఫ్రెండ్ గా నటించింది. మొత్తానికి చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నియతి వరుస ఛాన్స్ లతో బిజీగా మారింది.