Movies

వెంకటేష్ కెరీర్ లో ఎన్ని రీమేక్ సినిమాలు చేసాడో చూస్తే షాక్ అవుతారు

Venkatesh Remake Movies :విక్టరీ వెంకటేష్ గా పేరుతెచ్చుకున్న దగ్గుబాటి వెంకటేష్ తన కెరీర్ లో చాలా మూవీస్ రీమేక్ కావడం,అవి హిట్ కొట్టడం విశేషం. ముమ్ముట్టి ఆనందం మూవీని తెలుగులో సంక్రాంతిగా తీసి హిట్ కొట్టాడు. తమిళంలో సూర్య హీరోగా వచ్చిన కాకా కాకా మూవీని తెలుగులో ఘర్షణ గా తీసి మిశ్రమ ఫలితం అందుకున్నాడు. విక్రమ్ నటించిన జెమిని తమిళ మూవీని అదేపేరుతో రీమేక్ చేసి, డిజాస్టర్ అయింది. మాధవన్ హీరోగా చేసిన మూవీని తెలుగులో గురుగా చేసి హిట్ కొట్టాడు. అర్జున్, కార్తీక్ లు నటించిన తమిళ మూవీని రాజాగా రీమేక్ చేసి, సూపర్ హిట్ కొట్టాడు. భాగ్యరాజా హీరోగా వచ్చిన సుందరకాండం మూవీని సుందరకాండగా తెలుగులో తీసి మంచి హిట్ అందుకున్నాడు. హిందీలో పరేష్ రావల్, అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్ తో కల్సి గోపాల గోపాల మూవీ చేసి హిట్ అందుకున్నాడు.

ఇక మోహన్ లాల్ హీరోగా నటించిన దృశ్యం మూవీని అదే పేరుతొ రీమేక్ చేసి వెంకీ భారీ హిట్ అందుకున్నాడు. మలయాళంలో వచ్చిన బాడీగార్డ్ మూవీని అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసి ప్లాప్ అయ్యాడు. హిందీలో వచ్చిన బోల్ బచ్చన్ మూవీని తెలుగులో రామ్ తో కల్సి మసాలా గా చేసి, ప్లాప్ అందుకున్నాడు. తమిళంలో హిట్ కొట్టిన రజనీకాంత్ మూవీని తెలుగులో కొండపల్లి రాజాగా తీసి, మిశ్రమ ఫలితాన్ని అందుకున్నాడు. హాలీవుడ్ మూవీకి తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీసిన ముద్దుల ప్రియుడు డిజాస్టర్ అయింది. తెలుగులో హిట్ కొట్టిన యమలీల మూవీని హిందీలో రిమేక్ చేసి డిజాస్టర్ గా మిగిలాడు. కన్నడలో విష్ణువర్ధన్ నటించిన మూవీని తెలుగులో నాగవల్లిగా చేసి, వెంకీ ఆకట్టుకోలేకపోయాడు. అలాగే హిందీ మూవీని కమల్ తో కల్సి ఈనాడు మూవీగా రీమేక్ చేసి ప్లాప్ అయ్యాడు.

తమిళంలో వచ్చిన మూవీని తెలుగులో చిన్నరాయుడు గా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రభు హీరోగా వచ్చిన చిన్నతంబి మూవీని చంటిగా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇదే హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకోవడం విశేషం. వసంతం మూవీ కూడా ఇంచుమించు రీమేక్ లాంటిదే. మంచి హిట్ అందుకుంది. తమిళంలో హిట్ అయిన మూవీని తెలుగులో శీను గా తీసి, నిరాశ చెందాడు. తమిళంలో హిట్ కొట్టిన మూవీని తెలుగులో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీగా చేసి, మంచి హిట్ అందుకున్నాడు. తమిళంలో శరత్ కుమార్ హీరోగా వచ్చిన సూర్యవంశం మూవీని అదే టైటిల్ తో రీమేక్ చేసి వెంకీ సూపర్ హిట్ అందుకున్నాడు. హిందీలో వచ్చిన మూవీని తెలుగులో పోకిరి రాజాగా రీమేక్ చేసి ప్లాప్ మూటగట్టుకున్నాడు. తమిళంలో భాగ్యరాజా తీసిన మూవీని హిందీలో బెటాగా తీయగా తెలుగులో అబ్బాయిగారుగా తీస్తే ప్లాప్ అయింది. తాజాగా చేస్తున్న తమిళంలో ధనుష్ హీరోగా నటించిన అసురన్ మూవీని నారప్ప గా చేస్తున్నాడు.